Perum geerdi neesedide penamga nela

పేరుఁ గీర్తి నీచేతిదే పెనఁగ నేల
Language

(॥పల్లవి॥)
పేరుఁ గీర్తి నీచేతిదే పెనఁగ నేల
నూరలుకలును నొక్కనూలునఁ దీర్చితిని

(॥పేరు॥)
పాయపు వారి మాటలు పట్టరాదు ముట్టరాదు
చాయకు దొలగి వుండు సటాలూఁగావు
నీయంత నీవు రాజవు నేనే యాఁటదానను
వేయిటి కొక్క వలపు వెల కట్టిచ్చితిని

(॥పేరు॥)
సిరిగలవాని చేఁత చెప్పరాదు చూపరాదు
విరసాలవలె నుండు విడువరాదు
దొరవు నీవు నేను దోసిటిపాలదానను
సరి లక్షకు నామొక్కు సంచకా రిచ్చితిని

(॥పేరు॥)
ఆలిమగనిపొందులు అడరాదు చూడరాదు
తాలిమివలెనే వుండు తనివిలేదు
యేలి కూడితివి నన్ను యిట్టె శ్రీవేంకటేశ
పాలించు మెచ్చు కోటికిఁ బడిగె యోత్తితిని

(||pallavi||)
perum̐ gīrdi nīsedide pĕnam̐ga nela
nūralugalunu nŏkkanūlunam̐ dīrsidini

(||peru||)
pāyabu vāri māḍalu paṭṭarādu muṭṭarādu
sāyagu dŏlagi vuṁḍu saḍālūm̐gāvu
nīyaṁta nīvu rājavu nene yām̐ṭadānanu
veyiḍi kŏkka valabu vĕla kaṭṭichchidini

(||peru||)
sirigalavāni sem̐ta sĕpparādu sūbarādu
virasālavalĕ nuṁḍu viḍuvarādu
dŏravu nīvu nenu dosiḍibāladānanu
sari lakṣhagu nāmŏkku saṁchagā richchidini

(||peru||)
ālimaganibŏṁdulu aḍarādu sūḍarādu
tālimivalĕne vuṁḍu taniviledu
yeli kūḍidivi nannu yiṭṭĕ śhrīveṁkaḍeśha
pāliṁchu mĕchchu koḍigim̐ baḍigĕ yottidini