పేరఁటాండ్లు వాడరే పెండ్లివేళ
(॥పల్లవి॥)
పేరఁటాండ్లు వాడరే పెండ్లివేళ
సారెసారె నిద్దరికి సంతోషవేళ
(॥పేరఁ॥)
చి త్తజుతల్లికి వేగ సింగారించరె మీరు
తత్తరించె రిదె ముహుర్తపువేళ
హత్తి తలఁబాలు నారాయణునిఁ బోయుమనరే
పొత్తుల నిద్దరికిని బువ్వపువేళ
(॥పేరఁ॥)
పాలవెల్లి కూతుఁరునకు పసపులు నలఁచరే
చాలించరే జోలి వీడు చదివేవేళ
పాలుపడి పరపులు పరచరే దేవునికి
నాలుగోదినము నేఁడు నాగవెల్లివేళ
(॥పేరఁ॥)
అంది బాగాలియ్యరే అలమేలుమంగకును
కందువ శ్రీవేంకటేశుఁ గలసేవేళ
గందమూఁ గస్తూరి నీరె ఘనరతి నలసిరి
కుందక యిద్దరు నిఁకఁ గొలువుండేవేళ
(||pallavi||)
peram̐ṭāṁḍlu vāḍare pĕṁḍliveḽa
sārĕsārĕ niddarigi saṁtoṣhaveḽa
(||peram̐||)
si ttajudalligi vega siṁgāriṁcharĕ mīru
tattariṁchĕ ridĕ muhurdabuveḽa
hatti talam̐bālu nārāyaṇunim̐ boyumanare
pŏttula niddarigini buvvabuveḽa
(||peram̐||)
pālavĕlli kūdum̐runagu pasabulu nalam̐sare
sāliṁchare joli vīḍu sadiveveḽa
pālubaḍi parabulu parasare devunigi
nālugodinamu nem̐ḍu nāgavĕlliveḽa
(||peram̐||)
aṁdi bāgāliyyare alamelumaṁgagunu
kaṁduva śhrīveṁkaḍeśhum̐ galaseveḽa
gaṁdamūm̐ gastūri nīrĕ ghanaradi nalasiri
kuṁdaga yiddaru nim̐kam̐ gŏluvuṁḍeveḽa