Peram bera valabulu pemtalayyeeni

పేరఁ బేర వలపులు పెంటలయ్యీని
Language

(॥పల్లవి॥)
పేరఁ బేర వలపులు పెంటలయ్యీని
నేరుపులు లోలోనే నింతముగాని

(॥పేరఁ॥)
తేనెగారేమోవిమీఁద తీపుమాట లాడకువే
మోనమున నాకు గడుమొగచాటాయ
నూనెగారేచెక్కులపై నున్నఁజే యిడకువే
సోనలై జీరుకువారీఁ జూపులకు నాకు

(॥పేరఁ॥)
తళుకుదంతాలమీఁద తగ నవ్వు చిందకువే
తెలుపు రేయిపగలుఁ దెలియనీదు
చిలుకుఁజూపులలోన సిగ్గలు నించకువే
తలపోఁత నా మనసు తగిలి పోనీదు

(॥పేరఁ॥)
పిక్కటిల్లుఁ జన్నుతో బిగువున వీఁగకువే
మక్కువ నాకాఁగిటికి మారుకొనీని
యెక్కువైన శ్రీ వేంకటేశుఁడు నేఁ గలసితి
మొక్కకువే సారె నట్టె మోఁపులై నిండీని

(||pallavi||)
peram̐ bera valabulu pĕṁṭalayyīni
nerubulu lolone niṁtamugāni

(||peram̐||)
tenĕgāremovimīm̐da tībumāḍa lāḍaguve
monamuna nāgu gaḍumŏgasāḍāya
nūnĕgāresĕkkulabai nunnam̐je yiḍaguve
sonalai jīruguvārīm̐ jūbulagu nāgu

(||peram̐||)
taḽugudaṁtālamīm̐da taga navvu siṁdaguve
tĕlubu reyibagalum̐ dĕliyanīdu
silugum̐jūbulalona siggalu niṁchaguve
talabom̐ta nā manasu tagili ponīdu

(||peram̐||)
pikkaḍillum̐ jannudo biguvuna vīm̐gaguve
makkuva nāgām̐giḍigi mārugŏnīni
yĕkkuvaina śhrī veṁkaḍeśhum̐ḍu nem̐ galasidi
mŏkkaguve sārĕ naṭṭĕ mom̐pulai niṁḍīni