Peradaamdlu sobaana berasi paaderu gaani

పేరటాండ్లు సోబాన బెరసి పాడేరు గాని
Language

(॥పల్లవి॥)
పేరటాండ్లు సోబాన బెరసి పాడేరు గాని
చేరి మాకు సంతోసము సేయుఁడీ ఇప్పుడు

(॥॥)
చెంగలి చూపులఁ జూచెఁ జెలియ నిన్ను
అంగవించి నవ్వితివి అందుకు నీవు
సంగ తాయ నిద్దరికి సరి మోహము
సింగారపుఁ బెండ్లి పీఁటఁ జెంది కూచుండరయ్యా

(॥॥)
సరసపుమాట లాడె సకియ నీతో
నిరవుగ సమ్మతించి ఇయ్యకొంటివి
అరుదుగఁ దారుకాణ లాయ మీ పొందు
సరవిగా మీరు సేసలు చల్లరయ్యా

(॥॥)
అట్టే నీపైఁ జేయి వేసే నలమేల్మంగ
గట్టిగా శ్రీ వేంకటేశ కౌఁగిలించితి
గుట్టు దెలిసెను మీమీ గుణము లెల్లా
నెట్టు కొని పాయక మీ నేర్పులు చూపరయ్యా.

(||pallavi||)
peraḍāṁḍlu sobāna bĕrasi pāḍeru gāni
seri māgu saṁtosamu seyum̐ḍī ippuḍu

(||||)
sĕṁgali sūbulam̐ jūsĕm̐ jĕliya ninnu
aṁgaviṁchi navvidivi aṁdugu nīvu
saṁga tāya niddarigi sari mohamu
siṁgārabum̐ bĕṁḍli pīm̐ṭam̐ jĕṁdi kūsuṁḍarayyā

(||||)
sarasabumāḍa lāḍĕ sagiya nīdo
niravuga sammadiṁchi iyyagŏṁṭivi
arudugam̐ dārugāṇa lāya mī pŏṁdu
saravigā mīru sesalu sallarayyā

(||||)
aṭṭe nībaim̐ jeyi vese nalamelmaṁga
gaṭṭigā śhrī veṁkaḍeśha kaum̐giliṁchidi
guṭṭu dĕlisĕnu mīmī guṇamu lĕllā
nĕṭṭu kŏni pāyaga mī nerbulu sūbarayyā.