పెనుఁ బండుగలు సేసి పిలిపించె నిన్న మాపె
(॥పల్లవి॥)
పెనుఁ బండుగలు సేసి పిలిపించె నిన్న మాపె
పెనఁగీఁ జిత్తపు చింత పెనులంపటముల
(॥పెను॥)
చెవులఁ బండుగ సేనె చెలి నీ సుద్దులు విని
నవకపు వేడుక నిన్నటిమాపె
తివిరి వేగుదాఁకా దీపాళిపండుగ నేసె
జవకట్టి నినుఁ బాసి జాగరాలను
(॥పెను॥)
కన్నులపండుగ సేసె కలికి మేడపై నుండి
నిన్నుఁ దప్ప కిట్టె చూచి నిన్నమాపె
వున్నతి నొక నిమిష ముగాదిపండుగ నేనె
తన్నుఁ దానె తనలోని తమకానను
(॥పెను॥)
నిచ్చపండుగలు సేసే నీతోడి మాటలనె
నెచ్చెలి యల్లంతనుండి నిన్న మాపె
పచ్చిగా లక్ష్మిదేవి పండుగలు సేసె నిదె
యిచ్చకుఁడ శ్రీవెంకటేశ నిన్నుఁ గూడెనూ
(||pallavi||)
pĕnum̐ baṁḍugalu sesi pilibiṁchĕ ninna mābĕ
pĕnam̐gīm̐ jittabu siṁta pĕnulaṁpaḍamula
(||pĕnu||)
sĕvulam̐ baṁḍuga senĕ sĕli nī suddulu vini
navagabu veḍuga ninnaḍimābĕ
tiviri vegudām̐kā dībāḽibaṁḍuga nesĕ
javagaṭṭi ninum̐ bāsi jāgarālanu
(||pĕnu||)
kannulabaṁḍuga sesĕ kaligi meḍabai nuṁḍi
ninnum̐ dappa kiṭṭĕ sūsi ninnamābĕ
vunnadi nŏga nimiṣha mugādibaṁḍuga nenĕ
tannum̐ dānĕ tanaloni tamagānanu
(||pĕnu||)
nichchabaṁḍugalu sese nīdoḍi māḍalanĕ
nĕchchĕli yallaṁtanuṁḍi ninna mābĕ
pachchigā lakṣhmidevi paṁḍugalu sesĕ nidĕ
yichchagum̐ḍa śhrīvĕṁkaḍeśha ninnum̐ gūḍĕnū