పెనఁగితే వలపులు పిప్పిగట్టీని
(॥పల్లవి॥)
పెనఁగితే వలపులు పిప్పిగట్టీని
గొనకొన్న యప్పుడే కొంగువట్టేను
(॥॥)
మునుప నేఁ బైకొంటే మొగచాటు దోఁచీని
ననిచి తాఁ గనుఁగొంటే నవ్వు నవ్వేను
వెనుకొంటే నింతలోనే వేసటలు వుట్టీని
మనసిచ్చినప్పుడే మాటలాడేను
(॥॥)
బలిమి నేఁజేసితేను పలుకులు చప్పనౌను
సలిగె గలప్పుడే పిలిపించేను
చలపట్టితే మరి చండిపెట్టినట్లయీ
పలె నన్నప్పుడు తనవద్ద నుండేను
(॥॥)
తోడఁదోడ నైతేను తొక్కుడువడీఁ బంతము
కూడినప్పుడే కొనగోర నూఁదేను
యీడనే శ్రీవేంకటేశుఁ డిపుడే తానన్నుఁ గూడె
జాడతోఁదనకు నిట్టే సతమయ్యేను
(||pallavi||)
pĕnam̐gide valabulu pippigaṭṭīni
gŏnagŏnna yappuḍe kŏṁguvaṭṭenu
(||||)
munuba nem̐ baigŏṁṭe mŏgasāḍu dom̐sīni
nanisi tām̐ ganum̐gŏṁṭe navvu navvenu
vĕnugŏṁṭe niṁtalone vesaḍalu vuṭṭīni
manasichchinappuḍe māḍalāḍenu
(||||)
balimi nem̐jesidenu palugulu sappanaunu
saligĕ galappuḍe pilibiṁchenu
salabaṭṭide mari saṁḍibĕṭṭinaṭlayī
palĕ nannappuḍu tanavadda nuṁḍenu
(||||)
toḍam̐doḍa naidenu tŏkkuḍuvaḍīm̐ baṁtamu
kūḍinappuḍe kŏnagora nūm̐denu
yīḍane śhrīveṁkaḍeśhum̐ ḍibuḍe tānannum̐ gūḍĕ
jāḍadom̐danagu niṭṭe sadamayyenu