Penamge voorage priyabadi naado

పెనఁగే వూరకే ప్రియపడి నాతో
Language

(॥పల్లవి॥)
పెనఁగే వూరకే ప్రియపడి నాతో
ననుపు నటించక నయమౌనా

(॥పెన॥)
చిత్తములోపలిసిలుగులు వాయక
బత్తులు సేయఁగఁ బనిగలదా
వొత్తినగొళ్లు వొళ్లనే వుండఁగ
హత్తినకాఁగిలి అనువౌనా

(॥పెన॥)
నగవులలోపలి నలుసులు దియ్యక
పగటులు సేయఁగఁ బని గలదా
తగిలిదండలు తతి మెడనుండఁగ
వెగటుగఁ బెనఁగఁగ వేడుకలైనా

(॥పెన॥)
వలపులలోపలి వాసులు దోయక
బలుములు చూపఁగఁ బని గలదా
యెలమిని శ్రీవేంకటేశ కూడితివి
కలసిరతులకుఁ గడమలు నౌనా

(||pallavi||)
pĕnam̐ge vūrage priyabaḍi nādo
nanubu naḍiṁchaga nayamaunā

(||pĕna||)
sittamulobalisilugulu vāyaga
battulu seyam̐gam̐ banigaladā
vŏttinagŏḽlu vŏḽlane vuṁḍam̐ga
hattinagām̐gili anuvaunā

(||pĕna||)
nagavulalobali nalusulu diyyaga
pagaḍulu seyam̐gam̐ bani galadā
tagilidaṁḍalu tadi mĕḍanuṁḍam̐ga
vĕgaḍugam̐ bĕnam̐gam̐ga veḍugalainā

(||pĕna||)
valabulalobali vāsulu doyaga
balumulu sūbam̐gam̐ bani galadā
yĕlamini śhrīveṁkaḍeśha kūḍidivi
kalasiradulagum̐ gaḍamalu naunā