పెనఁగకురే మీ రింత ప్రియునితోఁ బలుమారు
(॥పల్లవి॥)
పెనఁగకురే మీ రింత ప్రియునితోఁ బలుమారు
తనకు నిచ్చయినవేళ తలఁపు గలిగీని
(॥పెనఁగ॥)
వలచి యలిగిన యలుక వడిఁ దేర్చవచ్చుఁ గాక
వొలసి నొల్లని యలుక లొకరి వశమా
మెలఁగి నిద్రించు విభుని మేలుకొలపవచ్చుఁ గాక
తెలసి వుండిన నిదుర తెగి లేపవశమా
(॥పెనఁగ॥)
చనవుగలిగినమాట చవిసేయవచ్చుఁ గాక
మనసు లెనయనిచోట మరుప వశమా
వినరే యాఁకటిపతికి విందు చెప్పవచ్చుఁ గాక
తనిసివుండినయపుడు తమ రేఁచ వశమా
(॥పెనఁగ॥)
పాయరాని చుట్టరికము పట్టి పెనఁగవచ్చుఁ గాక
కాయకపు వావులకుఁ గలయ వశమా
యీయెడల శ్రీవేంకటేశుఁ డిటు ననుఁ గూడె
చాయలనాతనిమేలు జవకట్ట వశమా
(||pallavi||)
pĕnam̐gagure mī riṁta priyunidom̐ balumāru
tanagu nichchayinaveḽa talam̐pu galigīni
(||pĕnam̐ga||)
valasi yaligina yaluga vaḍim̐ dersavachchum̐ gāga
vŏlasi nŏllani yaluga lŏgari vaśhamā
mĕlam̐gi nidriṁchu vibhuni melugŏlabavachchum̐ gāga
tĕlasi vuṁḍina nidura tĕgi lebavaśhamā
(||pĕnam̐ga||)
sanavugaliginamāḍa saviseyavachchum̐ gāga
manasu lĕnayanisoḍa maruba vaśhamā
vinare yām̐kaḍibadigi viṁdu sĕppavachchum̐ gāga
tanisivuṁḍinayabuḍu tama rem̐sa vaśhamā
(||pĕnam̐ga||)
pāyarāni suṭṭarigamu paṭṭi pĕnam̐gavachchum̐ gāga
kāyagabu vāvulagum̐ galaya vaśhamā
yīyĕḍala śhrīveṁkaḍeśhum̐ ḍiḍu nanum̐ gūḍĕ
sāyalanādanimelu javagaṭṭa vaśhamā