పెనగొన్న కాఁగిళ్ళ పెండ్లాడవయ్యా
(॥పల్లవి॥)
పెనగొన్న కాఁగిళ్ళ పెండ్లాడవయ్యా
అనిశముఁ బాయలేని అలమేలుమంగను
(॥పన॥)
అంకెల మంచిగుణము లనేటినూలున నీకు
కంకణదారాలు గట్టెఁ గలికి
లంకెలుగా నీపై వలపు లనేబంగారుతో
కొంకులేనిమనసుల కొంగుముళ్లు వేసెను
(॥పన॥)
ఆసల నిండుఁజూపు లనేటిమేటిమొగ్గల
బాసికము గట్టె నీకుఁ బడఁతి
వాసితో నవ్వుల నేవలువముత్యాలనే
సేసపాలు సిగ్గున దోసిట నీపై నించెను
(॥పన॥)
వెరసి మనోరథము పెండ్లిపీఁటమీఁద
మరిగి నిన్నుఁ గూడె మగువ
ఆరుదై శ్రీవేంకటేశ అధరామృత బువ్వ-
మెరవు లేనిరతులయింట విందు వెట్టెను
(||pallavi||)
pĕnagŏnna kām̐giḽḽa pĕṁḍlāḍavayyā
aniśhamum̐ bāyaleni alamelumaṁganu
(||pana||)
aṁkĕla maṁchiguṇamu laneḍinūluna nīgu
kaṁkaṇadārālu gaṭṭĕm̐ galigi
laṁkĕlugā nībai valabu lanebaṁgārudo
kŏṁkulenimanasula kŏṁgumuḽlu vesĕnu
(||pana||)
āsala niṁḍum̐jūbu laneḍimeḍimŏggala
bāsigamu gaṭṭĕ nīgum̐ baḍam̐ti
vāsido navvula nevaluvamutyālane
sesabālu sigguna dosiḍa nībai niṁchĕnu
(||pana||)
vĕrasi manorathamu pĕṁḍlibīm̐ṭamīm̐da
marigi ninnum̐ gūḍĕ maguva
ārudai śhrīveṁkaḍeśha adharāmṛta buvva-
mĕravu leniradulayiṁṭa viṁdu vĕṭṭĕnu