పెంటలై వున్నారిదివో పేరటాండ్లిందరును
(॥పల్లవి॥)
పెంటలై వున్నారిదివో పేరటాండ్లిందరును
గొంటరివి యని యాడుకొనేరు గదయ్య
(॥పంట॥)
కడుఁగొత్త పెండ్లికొడుకవు యింతిఁ జెనకేవు
అడఁగి సిగ్గువడవు అదేమోయి
వొడివట్టి తీసేవు వొద్దనిందరు నుండఁగ
తొడ యెక్కించుకొనే విందుకు నవ్వేరయ్యా
(॥పంట॥)
బాసికము గట్టుకొని పడఁతిమోమే చూచేవు
ఆసల సిగ్గువడవు ఆదేమోయి
సేసవెట్టి తనియవు చెలులచేనందుకొని
లాసి పొత్తుకుఁ బిలిచే వీలాగుకు నవ్వేరయ్యా
(॥పంట॥)
పీఁటమీఁదఁ గూచుండి ప్రియరాలిఁ గూడితివి
ఆఁటదని సిగ్గువడ వదేమోయి
కోటికి శ్రీ వేంకటాద్రి గోవిందరాజ నన్నేలి
పాటించి చెప్పేవాపెకు భామలు నవ్వేరయ్యా
(||pallavi||)
pĕṁṭalai vunnāridivo peraḍāṁḍliṁdarunu
gŏṁṭarivi yani yāḍugŏneru gadayya
(||paṁṭa||)
kaḍum̐gŏtta pĕṁḍligŏḍugavu yiṁtim̐ jĕnagevu
aḍam̐gi sigguvaḍavu ademoyi
vŏḍivaṭṭi tīsevu vŏddaniṁdaru nuṁḍam̐ga
tŏḍa yĕkkiṁchugŏne viṁdugu navverayyā
(||paṁṭa||)
bāsigamu gaṭṭugŏni paḍam̐timome sūsevu
āsala sigguvaḍavu ādemoyi
sesavĕṭṭi taniyavu sĕlulasenaṁdugŏni
lāsi pŏttugum̐ bilise vīlāgugu navverayyā
(||paṁṭa||)
pīm̐ṭamīm̐dam̐ gūsuṁḍi priyarālim̐ gūḍidivi
ām̐ṭadani sigguvaḍa vademoyi
koḍigi śhrī veṁkaḍādri goviṁdarāja nanneli
pāḍiṁchi sĕppevābĕgu bhāmalu navverayyā