పెండిలిపీఁట యెక్కి బిగియనేల
(॥పల్లవి॥)
పెండిలిపీఁట యెక్కి బిగియనేల
వండి వండనట్లాయ వట్టిప్రియాలనవే
(॥పెండి॥)
వేడుకకు వెలలేదు వెన్నెలకు గురిలేదు
వీడె మిప్పించవే మోవివిందులాయను
యీడనే వుందాన నేను యెఱుఁగు నిన్నీఁదాను
కూడుమనఁగదే వాసి గోడపైసున్నము
(॥పెండి॥)
సూరియునిఁ జూడరాదు చుక్కలెల్లా నెంచరాదు
పోరచివెట్టించవే వొత్తు గలసె
కూరిమిసేసితి నేను కొంగువట్టినాఁడు తాను
కోరుకోవీవే సిగ్గు గోనెమీఁది తౌడు
(॥పెండి॥)
వావిగడిగితేఁ బోదు వల పొల్లనంటేఁ బోదు
సేవలు సేయించవే చెలిమి గూడె
కైవశము నేను శ్రీవేంకటేశ్వరుఁడు తాను
బావించనీవే మేలు పాలమీఁది మీఁగడ
(||pallavi||)
pĕṁḍilibīm̐ṭa yĕkki bigiyanela
vaṁḍi vaṁḍanaṭlāya vaṭṭipriyālanave
(||pĕṁḍi||)
veḍugagu vĕlaledu vĕnnĕlagu guriledu
vīḍĕ mippiṁchave moviviṁdulāyanu
yīḍane vuṁdāna nenu yĕṟum̐gu ninnīm̐dānu
kūḍumanam̐gade vāsi goḍabaisunnamu
(||pĕṁḍi||)
sūriyunim̐ jūḍarādu sukkalĕllā nĕṁcharādu
porasivĕṭṭiṁchave vŏttu galasĕ
kūrimisesidi nenu kŏṁguvaṭṭinām̐ḍu tānu
korugovīve siggu gonĕmīm̐di tauḍu
(||pĕṁḍi||)
vāvigaḍigidem̐ bodu vala pŏllanaṁṭem̐ bodu
sevalu seyiṁchave sĕlimi gūḍĕ
kaivaśhamu nenu śhrīveṁkaḍeśhvarum̐ḍu tānu
bāviṁchanīve melu pālamīm̐di mīm̐gaḍa