పెంచితి నిన్ను నేము పెద్దవైతి వింతలోనె
(॥పల్లవి॥)
పెంచితి నిన్ను నేము పెద్దవైతి వింతలోనె
యెంచిచూడ నీకతలు యెవ్వరు నేరిపిరే
(॥॥)
చిత్తడిచెమలేల చిందీనే
వత్తివలె మేనేల పసివాడీనే
చిత్తణివిద్యలనేల చిమిడేవే
యిత్తల నేఁడిఁ తేసి యెక్కడఁ గలిగెనే
(॥॥)
నెమ్మది నివ్వెరగులు నీకేఁటికే
వుమ్మగిలు నిట్టూర్పు లెందుండివచ్చెనే
కుమ్మరింపుఁ జింతలేల గుబ్బతిలీ నే
యిమ్ముల నీ చేఁతలకు నేరీతి నోమితివే
(॥॥)
చెక్కునఁబెట్టినచేతిసిగ్గు లేఁటికే
ముక్కర గదల నవ్వి మొఱఁగనేలే
యిక్కడ శ్రీ వేంకటేశుఁ డేలెనా నిన్ను
యెక్కె మోమునఁ గళలు యిన్నిటా మేలే
(||pallavi||)
pĕṁchidi ninnu nemu pĕddavaidi viṁtalonĕ
yĕṁchisūḍa nīgadalu yĕvvaru neribire
(||||)
sittaḍisĕmalela siṁdīne
vattivalĕ menela pasivāḍīne
sittaṇividyalanela simiḍeve
yittala nem̐ḍim̐ tesi yĕkkaḍam̐ galigĕne
(||||)
nĕmmadi nivvĕragulu nīgem̐ṭige
vummagilu niṭṭūrbu lĕṁduṁḍivachchĕne
kummariṁpum̐ jiṁtalela gubbadilī ne
yimmula nī sem̐talagu nerīdi nomidive
(||||)
sĕkkunam̐bĕṭṭinasedisiggu lem̐ṭige
mukkara gadala navvi mŏṟam̐ganele
yikkaḍa śhrī veṁkaḍeśhum̐ ḍelĕnā ninnu
yĕkkĕ momunam̐ gaḽalu yinniḍā mele