Pelusum gobabudaana birudugu modalanu

పెలుచుఁ గోపపుదాన బిరుదుకు మొదలను
Language

(॥పల్లవి॥)
పెలుచుఁ గోపపుదాన బిరుదుకు మొదలను
యెలమి నీగుణాలే న న్నింత వలపించెను

(॥పలచు॥)
తత్తరించి నే నిన్ను తగుల నాడినందుకు
చిత్తన నొవ్వక నన్నుఁ జేర వచ్చేవూ
మత్తిలి నేఁ గోసరితే మరి నీవు నవ్వేవు
యిత్తల నీమంచితనా లింత వలపించెనూ

(॥పలుచు॥)
గక్కన నీరాకు నేఁ గైకో కుండినందుకు
అక్కర దీర న న్నంటి ఆదిరించేవూ
వొక్కటి గా కూరకున్న వొడఁబరచ వచ్చేవు
యిక్కువ నీ నేరువు న న్నింత వలపించెనూ

(॥పలుచు॥)
వొంటిఁ గాఁగిలించఁగాని నిన్నొట్టు వెట్టినయందుకు
బంటువలె వెంట వెంటఁ బాయ కుండేవూ
అంట కుంటే శ్రీవెంకటాధిప నన్నుఁ గూడితి
వింటనే నీ చనవులు యింత వలపించెనూ

(||pallavi||)
pĕlusum̐ gobabudāna birudugu mŏdalanu
yĕlami nīguṇāle na nniṁta valabiṁchĕnu

(||palasu||)
tattariṁchi ne ninnu tagula nāḍinaṁdugu
sittana nŏvvaga nannum̐ jera vachchevū
mattili nem̐ gosaride mari nīvu navvevu
yittala nīmaṁchidanā liṁta valabiṁchĕnū

(||palusu||)
gakkana nīrāgu nem̐ gaigo kuṁḍinaṁdugu
akkara dīra na nnaṁṭi ādiriṁchevū
vŏkkaḍi gā kūragunna vŏḍam̐barasa vachchevu
yikkuva nī neruvu na nniṁta valabiṁchĕnū

(||palusu||)
vŏṁṭim̐ gām̐giliṁcham̐gāni ninnŏṭṭu vĕṭṭinayaṁdugu
baṁṭuvalĕ vĕṁṭa vĕṁṭam̐ bāya kuṁḍevū
aṁṭa kuṁṭe śhrīvĕṁkaḍādhiba nannum̐ gūḍidi
viṁṭane nī sanavulu yiṁta valabiṁchĕnū