పెళ్లిచెట్టు మందుగాదు పెరిగి యెంతవుండినా
(॥పల్లవి॥)
పెళ్లిచెట్టు మందుగాదు పెరిగి యెంతవుండినా
పల్లదాన నే నీకు బాఁతైతి నిపుడా
(॥పెళ్లి॥)
సరసమాడేటివారు సంగడినే వుండఁగాను
తరవాత మాతో జాణతనా లాడేవు
కెరలినవారు కుచగిరుల నిన్నొత్తఁగాను
వెరసుగానేల వుండవింట వేసేవు నన్ను
(॥పెళ్లి॥)
వాడికసతులు వచ్చి వసమై నీ కుండఁగాను
యీడనున్నమమ్మునీవు యెలయించేవు
తోడఁబెండ్లాడేవారు దొమ్మి నిన్నుఁ జేయఁగాను
వీడె మిమ్మనచు నన్ను వేసరించేవు
(॥పెళ్లి॥)
కందువకు వచ్చివారు కడలనే వుండఁగాను
అంది నన్నుఁ గాఁగిలించి అట్టె కూడేవు
చెందిన వారుండఁగాను శ్రీవేంకటేశ నన్ను
మందలించి పైకొని మన్నించేవూ
(||pallavi||)
pĕḽlisĕṭṭu maṁdugādu pĕrigi yĕṁtavuṁḍinā
palladāna ne nīgu bām̐taidi nibuḍā
(||pĕḽli||)
sarasamāḍeḍivāru saṁgaḍine vuṁḍam̐gānu
taravāda mādo jāṇadanā lāḍevu
kĕralinavāru kusagirula ninnŏttam̐gānu
vĕrasugānela vuṁḍaviṁṭa vesevu nannu
(||pĕḽli||)
vāḍigasadulu vachchi vasamai nī kuṁḍam̐gānu
yīḍanunnamammunīvu yĕlayiṁchevu
toḍam̐bĕṁḍlāḍevāru dŏmmi ninnum̐ jeyam̐gānu
vīḍĕ mimmanasu nannu vesariṁchevu
(||pĕḽli||)
kaṁduvagu vachchivāru kaḍalane vuṁḍam̐gānu
aṁdi nannum̐ gām̐giliṁchi aṭṭĕ kūḍevu
sĕṁdina vāruṁḍam̐gānu śhrīveṁkaḍeśha nannu
maṁdaliṁchi paigŏni manniṁchevū