Pekku sadulam bemdlaadi berasinavaamdu taanu

పెక్కు సతులఁ బెండ్లాడి బెరసినవాఁడు తాను
Language

(॥పల్లవి॥)
పెక్కు సతులఁ బెండ్లాడి బెరసినవాఁడు తాను
వెక్కసము లెంతైనా వేసరకు మనవే

(॥॥)
మొలచిన తమకము మోసులు వారకుండునా
కలసిన వావులు కడ నుండునా
నలిరేఁగి సారె సారె నవ్వితిఁ దనతో నేను
వెలలేని వెన్నైనా వేసరకు మనవే

(॥॥)
చిగిరించిన వలపు చెట్టు కట్ట కుండునా
తగులైన పొందులు దాఁచవచ్చునా
అగపడి సరసము లాడితిఁ దనతో నేను
వెగటెంతైనా నాయ వేసరకు మనవే

(॥॥)
గుదిగొన్న ననుపలు కుప్పలు గాకుండునా
చెదర నీ మోవి తీపు చెప్పవచ్చునా
అదన శ్రీ వేంకటేశుఁ డలమేల్మంగను నేను
వెదకి వచ్చి నన్నేలె వేసరకు మనవే

(||pallavi||)
pĕkku sadulam̐ bĕṁḍlāḍi bĕrasinavām̐ḍu tānu
vĕkkasamu lĕṁtainā vesaragu manave

(||||)
mŏlasina tamagamu mosulu vāraguṁḍunā
kalasina vāvulu kaḍa nuṁḍunā
nalirem̐gi sārĕ sārĕ navvidim̐ danado nenu
vĕlaleni vĕnnainā vesaragu manave

(||||)
sigiriṁchina valabu sĕṭṭu kaṭṭa kuṁḍunā
tagulaina pŏṁdulu dām̐savachchunā
agabaḍi sarasamu lāḍidim̐ danado nenu
vĕgaḍĕṁtainā nāya vesaragu manave

(||||)
gudigŏnna nanubalu kuppalu gāguṁḍunā
sĕdara nī movi tību sĕppavachchunā
adana śhrī veṁkaḍeśhum̐ ḍalamelmaṁganu nenu
vĕdagi vachchi nannelĕ vesaragu manave