Pekku nichchagalyaanaala pemdligodugaa

పెక్కు నిచ్చకల్యాణాల పెండ్లికొడుకా
Language

(॥పల్లవి॥)
పెక్కు నిచ్చకల్యాణాల పెండ్లికొడుకా
మిక్కిలి జాణఁడవయ్యా మేలయ్య నీకు

(॥పెక్కు॥)
చెలులుపదారువేల సేసవెట్టినచేతుల
చెలఁగి నాకు మొక్కేవు చెల్లునా నీకు
కలఁగక గొల్లెతలకాలుదొక్కే పాదమున
అలరి నాకాలు దొక్కే వౌనయ్య నీవు

(॥పెక్కు॥)
పురకాంతలఁగూడ బోడించినమాటల
ధర సరసమాడేవు తగునా నీవు
పరగఁ గొలనిలోని పచ్చితనపుచూపుల
వొరసి మమ్ముఁ జూచేవు వోయమ్మ నీవు

(॥పెక్కు॥)
కడుబలిమి రుక్మిణిఁగాఁగిఁలించిన కాఁగిట
యెడయక కాఁగిలించే విదివో నన్ను
కడఁగి శ్రీవేంకటాద్రిఘనుఁడ నీకు నాకు
బడినే శోభనములు పైకొనెనయ్యా

(||pallavi||)
pĕkku nichchagalyāṇāla pĕṁḍligŏḍugā
mikkili jāṇam̐ḍavayyā melayya nīgu

(||pĕkku||)
sĕlulubadāruvela sesavĕṭṭinasedula
sĕlam̐gi nāgu mŏkkevu sĕllunā nīgu
kalam̐gaga gŏllĕdalagāludŏkke pādamuna
alari nāgālu dŏkke vaunayya nīvu

(||pĕkku||)
puragāṁtalam̐gūḍa boḍiṁchinamāḍala
dhara sarasamāḍevu tagunā nīvu
paragam̐ gŏlaniloni pachchidanabusūbula
vŏrasi mammum̐ jūsevu voyamma nīvu

(||pĕkku||)
kaḍubalimi rukmiṇim̐gām̐gim̐liṁchina kām̐giḍa
yĕḍayaga kām̐giliṁche vidivo nannu
kaḍam̐gi śhrīveṁkaḍādrighanum̐ḍa nīgu nāgu
baḍine śhobhanamulu paigŏnĕnayyā