Pechchuverigee nimti priyamulu lolone

పెచ్చువెరిగీ నింతి ప్రియములు లోలోనె
Language

(॥పల్లవి॥)
పెచ్చువెరిగీ నింతి ప్రియములు లోలోనె
యిచ్చక మేమాడుదమే నెచ్చెలులాల

(॥పెచ్చు॥)
తమకము లుప్పతిల్లి దైలువారఁదొడఁగి
చెమరించె మేనెల్లా చెలియకును
కొమరెపాయ మందుపై కుప్పులు దెప్పలు నాయ
ఇముడక, వుపచారా లేమిసేతమే

(॥పెచ్చు॥)
తలపోఁత లుక్కుమీరి తడఁ బడఁగఁ దొడఁగి
పులకించెఁ జెక్కు లిట్టె పొలఁతికిని
పెలుచువలపు పెండ్లి పేరటముగా విడిసె
కలికి భావము చెప్ప గతలాయెనే

(॥పెచ్చు॥)
సరసము లెడచొచ్చి చవులు రేఁచఁ దొడఁగి
కరఁగించె నెమ్మనము కలికికిని
యిరవై శ్రీ వేంకటేశుఁ డింతలో నీసతిఁగూడె
యెరవులేనీతనితో నేమందమే

(||pallavi||)
pĕchchuvĕrigī niṁti priyamulu lolonĕ
yichchaga memāḍudame nĕchchĕlulāla

(||pĕchchu||)
tamagamu luppadilli dailuvāram̐dŏḍam̐gi
sĕmariṁchĕ menĕllā sĕliyagunu
kŏmarĕbāya maṁdubai kuppulu dĕppalu nāya
imuḍaga, vubasārā lemisedame

(||pĕchchu||)
talabom̐ta lukkumīri taḍam̐ baḍam̐gam̐ dŏḍam̐gi
pulagiṁchĕm̐ jĕkku liṭṭĕ pŏlam̐tigini
pĕlusuvalabu pĕṁḍli peraḍamugā viḍisĕ
kaligi bhāvamu sĕppa gadalāyĕne

(||pĕchchu||)
sarasamu lĕḍasŏchchi savulu rem̐sam̐ dŏḍam̐gi
karam̐giṁchĕ nĕmmanamu kaligikini
yiravai śhrī veṁkaḍeśhum̐ ḍiṁtalo nīsadim̐gūḍĕ
yĕravulenīdanido nemaṁdame