Payyada maṟamgusesi padinela moṟamgevu

పయ్యద మఱఁగుసేసి పతినేల మొఱఁగేవు
Language

(॥పల్లవి॥)
పయ్యద మఱఁగుసేసి పతినేల మొఱఁగేవు
నెయ్యంపు వేడుకలు నెరవేర్చుకొనవే

(॥పయ్య॥)
మొలకనవ్వులతేట మూటగట్టఁగరాదు
తలపోఁ తజలనిధులు దాఁటరావు
కలువకన్నులచూపు గాదెఁ బోయఁగరాదు
యెలమి నవలపు లిఁక నెట్ల దాఁచేవే

(॥పయ్య॥)
కుదురుగుబ్బల మెఱఁగు కొలఁది వెట్టఁగరాదు
పెదవితేనెలతీపు పిండరాదు
ముదురుఁ దమకములు మరి మూలకొదుపఁగరాదు
యెదిటి నీచక్కఁదన మెట్ల దాఁచేవే

(॥పయ్య॥)
పరగునీచెలువ మేర్పరచి చెప్పఁగరాదు
మరుచేఁత లెంతైన మరవరాదు
సిరులనలమేల్మంగ శ్రీవేంకటేశుఁ డేలె
ఇరవాయ నీపొందులెట్ల దాఁచేవే

(||pallavi||)
payyada maṟam̐gusesi padinela mŏṟam̐gevu
nĕyyaṁpu veḍugalu nĕraversugŏnave

(||payya||)
mŏlaganavvuladeḍa mūḍagaṭṭam̐garādu
talabom̐ tajalanidhulu dām̐ṭarāvu
kaluvagannulasūbu gādĕm̐ boyam̐garādu
yĕlami navalabu lim̐ka nĕṭla dām̐seve

(||payya||)
kudurugubbala mĕṟam̐gu kŏlam̐di vĕṭṭam̐garādu
pĕdavidenĕladību piṁḍarādu
mudurum̐ damagamulu mari mūlagŏdubam̐garādu
yĕdiḍi nīsakkam̐dana mĕṭla dām̐seve

(||payya||)
paragunīsĕluva merbarasi sĕppam̐garādu
marusem̐ta lĕṁtaina maravarādu
sirulanalamelmaṁga śhrīveṁkaḍeśhum̐ ḍelĕ
iravāya nībŏṁdulĕṭla dām̐seve