Pattiraa dee valabu padulagunu sadulagunu

పట్టిరా దీ వలపు పతులకును సతులకును
Language

(॥పల్లవి॥)
పట్టిరా దీ వలపు పతులకును సతులకును
యెట్టు వలసిన వచ్చు నేటికి చెలియా

(॥పట్టి॥)
దోస మెఱుఁగదు వలపు దొరతనం బెడలించు
బాస దలఁచదు వలపు బతిమి చెఱుచు
తాసువంటిది వలపు తగిలితేఁ గుంగించు
యీసులకు మొదలు యిది యేటికే చెలియా

(॥పట్టి॥)
కన్నుల నుండు వలపు కప్పు కామాంధంబు
పన్ని పైకొను వలపు భయ మెఱుఁగదు
వెన్నవంటిది వలపు వెచ్చ నైతేఁ గరఁగు
యిన్ని విధముల నీకు నేటికే చెలియ

(॥పట్టి॥)
కలిమి చూడదు వలపు కడు నెమ్మెలే రేఁచు
చలువమేడౌ వలపు సరసములను
యెలమి శ్రీవేంకటేశుఁ డింతలో నినుఁ గూడె
యిల నిట్లాఁ గాకున్న నేటికే చెలియా

(||pallavi||)
paṭṭirā dī valabu padulagunu sadulagunu
yĕṭṭu valasina vachchu neḍigi sĕliyā

(||paṭṭi||)
dosa mĕṟum̐gadu valabu dŏradanaṁ bĕḍaliṁchu
bāsa dalam̐sadu valabu badimi sĕṟusu
tāsuvaṁṭidi valabu tagilidem̐ guṁgiṁchu
yīsulagu mŏdalu yidi yeḍige sĕliyā

(||paṭṭi||)
kannula nuṁḍu valabu kappu kāmāṁdhaṁbu
panni paigŏnu valabu bhaya mĕṟum̐gadu
vĕnnavaṁṭidi valabu vĕchcha naidem̐ garam̐gu
yinni vidhamula nīgu neḍige sĕliya

(||paṭṭi||)
kalimi sūḍadu valabu kaḍu nĕmmĕle rem̐su
saluvameḍau valabu sarasamulanu
yĕlami śhrīveṁkaḍeśhum̐ ḍiṁtalo ninum̐ gūḍĕ
yila niṭlām̐ gāgunna neḍige sĕliyā