Pattinappude neegu pamta mekkenu

పట్టినప్పుడె నీకు పంత మెక్కెను
Language

(॥పల్లవి॥)
పట్టినప్పుడె నీకు పంత మెక్కెను
ముట్టినదే ముయ్యాయ మొక్కు లేఁటి కయ్యా

(॥పట్టి॥)
సెలవి నవ్వులే వచ్చీ చేసన్న నీవు సేయఁగా
పలుకఁబోతే నామాట వచ్చిదోఁచీని
చెలులమోము చూచితే సిగ్గులును నొక్కవెద
వెలలేదు వేడుకకే వేగిర మేలయ్యా

(॥పట్టి॥)
చెమటే చెక్కులఁగారీ చేత నీవు ముట్టఁగాను
గుమితాన నుంటేఁ బ్రేమ గుండె వట్టిని
తమక మందుకుఁదోడు తరవాయ నొక్కవెద
కొమరాఁక కేది మేర కూచుండవయ్యా

(॥పట్టి॥)
కాయమెల్లా మరవయ్యా కాఁగిట నీవు గూడఁగ
నీయండఁ గూచుండేనంటే నివ్వెర గయ్యా
పాయక శ్రీవేంకటేశ భావరతు లొకవెద
నీయింపులె నాయింపులు నెమ్మది నుందమయ్యా

(||pallavi||)
paṭṭinappuḍĕ nīgu paṁta mĕkkĕnu
muṭṭinade muyyāya mŏkku lem̐ṭi kayyā

(||paṭṭi||)
sĕlavi navvule vachchī sesanna nīvu seyam̐gā
palugam̐bode nāmāḍa vachchidom̐sīni
sĕlulamomu sūside siggulunu nŏkkavĕda
vĕlaledu veḍugage vegira melayyā

(||paṭṭi||)
sĕmaḍe sĕkkulam̐gārī seda nīvu muṭṭam̐gānu
gumidāna nuṁṭem̐ brema guṁḍĕ vaṭṭini
tamaga maṁdugum̐doḍu taravāya nŏkkavĕda
kŏmarām̐ka kedi mera kūsuṁḍavayyā

(||paṭṭi||)
kāyamĕllā maravayyā kām̐giḍa nīvu gūḍam̐ga
nīyaṁḍam̐ gūsuṁḍenaṁṭe nivvĕra gayyā
pāyaga śhrīveṁkaḍeśha bhāvaradu lŏgavĕda
nīyiṁpulĕ nāyiṁpulu nĕmmadi nuṁdamayyā