పట్టినదెల్లాఁ దప్పు భావించినదే తప్పు
(॥పల్లవి॥)
పట్టినదెల్లాఁ దప్పు భావించినదే తప్పు
యెట్టయినఁ దలపోత లెనయనిచోటికి
(॥పట్టి॥)
మించుఁగాఁగిలియ్యఁబోతే మేనురాయుటే తప్పు
కంచపువిడిమిచ్చితేఁ గారమౌటే తప్పు
వుంచముగాఁ బిలిచితే నూఁకొనుటే తప్పు
ఇంచుకంత మతిలోన నీసడించేచోటికి
(॥పట్టి॥)
చేకొని మొక్కఁగఁబోతే చేతులు దాఁకుటే తప్పు
యీకడ మోవానితేను యెంగిలైనదే తప్పు
మేకుఁ గొప్పు దువ్వితేను మే గోరింటితే తప్పు
వూకించి లోలోన నొరటైనచోటికి
(॥పట్టి॥)
పానుపుపైఁ గూడితేను బడలఁజేయుటే తప్పు
యీనెపానఁ దారకాణ లిందరికిని
కోనలశ్రీవేంకటేశ కూడితివి నన్ను నేఁడు
యీనవ్వు మనకేకాని ఇంపుగానిచోటికి
(||pallavi||)
paṭṭinadĕllām̐ dappu bhāviṁchinade tappu
yĕṭṭayinam̐ dalaboda lĕnayanisoḍigi
(||paṭṭi||)
miṁchum̐gām̐giliyyam̐bode menurāyuḍe tappu
kaṁchabuviḍimichchidem̐ gāramauḍe tappu
vuṁchamugām̐ biliside nūm̐kŏnuḍe tappu
iṁchugaṁta madilona nīsaḍiṁchesoḍigi
(||paṭṭi||)
segŏni mŏkkam̐gam̐bode sedulu dām̐kuḍe tappu
yīgaḍa movānidenu yĕṁgilainade tappu
megum̐ gŏppu duvvidenu me goriṁṭide tappu
vūgiṁchi lolona nŏraḍainasoḍigi
(||paṭṭi||)
pānububaim̐ gūḍidenu baḍalam̐jeyuḍe tappu
yīnĕbānam̐ dāragāṇa liṁdarigini
konalaśhrīveṁkaḍeśha kūḍidivi nannu nem̐ḍu
yīnavvu managegāni iṁpugānisoḍigi