Pattinade tanagidi pamtamugaadaa

పట్టినదే తనకిది పంతముగాదా
Language

(॥పల్లవి॥)
పట్టినదే తనకిది పంతముగాదా
నెట్టన నీరువట్టైతే నేత నది దీరునా

(॥పాటింప॥)
తనకేలే నావిరతాపమునకు వగవ
ననుపున చిరునవ్వు నవ్వఁగాక
వినయములే చాలు వెనకకె అన్నీఁ జేసె
మును గోపగించి చెవులు మూసితే నమరునా

(॥పాటిప॥)
పదవే నే నుసురంటే భావము దయపుట్టీనా
ఇది ఇందరితోఁ జెప్పనెమ్మెతోఁగాక
కదియక ఆడనుండే కతలేల చెప్పీని
కెదటుచు నేటావలిగిగింత లంటునా

(॥పాటింప॥)
కాఁగిట నే నలమితే కాతరాలు మానీనా
చేఁగదేర మీకు నిన్నీఁ జెప్పితిఁగాక
ఆఁగి కూడె శ్రీవేంకటాధిపుఁ డింతలో నన్ను
పాఁగినరతి నంగడిఁ బచరింవచ్చునా

(||pallavi||)
paṭṭinade tanagidi paṁtamugādā
nĕṭṭana nīruvaṭṭaide neda nadi dīrunā

(||pāḍiṁpa||)
tanagele nāviradābamunagu vagava
nanubuna sirunavvu navvam̐gāga
vinayamule sālu vĕnagagĕ annīm̐ jesĕ
munu gobagiṁchi sĕvulu mūside namarunā

(||pāḍiba||)
padave ne nusuraṁṭe bhāvamu dayabuṭṭīnā
idi iṁdaridom̐ jĕppanĕmmĕdom̐gāga
kadiyaga āḍanuṁḍe kadalela sĕppīni
kĕdaḍusu neḍāvaligigiṁta laṁṭunā

(||pāḍiṁpa||)
kām̐giḍa ne nalamide kādarālu mānīnā
sem̐gadera mīgu ninnīm̐ jĕppidim̐gāga
ām̐gi kūḍĕ śhrīveṁkaḍādhibum̐ ḍiṁtalo nannu
pām̐ginaradi naṁgaḍim̐ basariṁvachchunā