Pattina salamulela palugaraadaa

పట్టిన చలములేల పలుకరాదా
Language

(॥పల్లవి॥)
పట్టిన చలములేల పలుకరాదా
యెట్టు చెప్పినా ని(న?)ట్టే యియ్యకొనరాదా

(॥॥)
ములువాఁడి గురుతుల మోవి నీకుఁ జూపితేను
నెలవుల నవ్వనేల చెప్పరాదా
తలుపుమూల నుండఁగ తగఁ గొంగువట్టితేను
కలువల వేయనేల కానిమ్మనరాదా

(॥॥)
చిక్కనిచెమటతోడి చేతులు పైఁ జాఁచితేను
దిక్కన జంకించనేల తెలుపరాదా
మక్కువ సిగ్గువడఁగ మంచముపై నిడుకొంటే
మొక్కులు మొక్కఁగనేల ముచ్చటాడరాదా

(॥॥)
కప్పురపుఁ దావి మేనఁ గాఁగిలించుకొంటేను
చొప్పులెత్తనేల కల్ల చూపరాదా
చిప్పిలఁ గూడితిఁ గదే శ్రీ వేంకటేశుఁడ నేను
దప్పులఁ బొరలనేల తనియఁ గరాదా

(||pallavi||)
paṭṭina salamulela palugarādā
yĕṭṭu sĕppinā ni(na?)ṭṭe yiyyagŏnarādā

(||||)
muluvām̐ḍi gurudula movi nīgum̐ jūbidenu
nĕlavula navvanela sĕpparādā
talubumūla nuṁḍam̐ga tagam̐ gŏṁguvaṭṭidenu
kaluvala veyanela kānimmanarādā

(||||)
sikkanisĕmaḍadoḍi sedulu paim̐ jām̐sidenu
dikkana jaṁkiṁchanela tĕlubarādā
makkuva sigguvaḍam̐ga maṁchamubai niḍugŏṁṭe
mŏkkulu mŏkkam̐ganela muchchaḍāḍarādā

(||||)
kappurabum̐ dāvi menam̐ gām̐giliṁchugŏṁṭenu
sŏppulĕttanela kalla sūbarādā
sippilam̐ gūḍidim̐ gade śhrī veṁkaḍeśhum̐ḍa nenu
dappulam̐ bŏralanela taniyam̐ garādā