Pattina salamulela padidodanu

పట్టిన చలములేల పతితోడను
Language

(॥పల్లవి॥)
పట్టిన చలములేల పతితోడను
ఱట్టు సేసుకొంటే నాఱడి గాకుండునా

(॥పట్టిన॥)
వంచనతో మొక్కితేనే వాడికెలీడేరుఁ గాక
పొంచి బింకాలు చూపితేఁ బొందుగూడునా
కంచము పొత్తు గాఁగానే కలసుఁగాక మనసు
పెంచిన యెరవులను ప్రియము గలుగునా

(॥పట్టిన॥)
సరసములాడఁగానే చనవులెల్ల నిండుఁగాక
తెరమరఁగైతే తరితీపు వుట్టునా
శిరసెత్తి నవ్వఁగానే చింతలెల్ల మానుఁగాక
కరికరి సేసుకొంటే కైవసములౌనా

(॥పట్టిన॥)
తప్పక చూడఁగానే తగులాయమౌఁ గాక
రెప్పలు మూసుకొంటే రేఁగునా తమి
యిప్పుడే శ్రీవేంకటేశునెనసితి విటువలె
మెప్పించకున్న నేర్పులు మిక్కిలి మెరసునా

(||pallavi||)
paṭṭina salamulela padidoḍanu
ṟaṭṭu sesugŏṁṭe nāṟaḍi gāguṁḍunā

(||paṭṭina||)
vaṁchanado mŏkkidene vāḍigĕlīḍerum̐ gāga
pŏṁchi biṁkālu sūbidem̐ bŏṁdugūḍunā
kaṁchamu pŏttu gām̐gāne kalasum̐gāga manasu
pĕṁchina yĕravulanu priyamu galugunā

(||paṭṭina||)
sarasamulāḍam̐gāne sanavulĕlla niṁḍum̐gāga
tĕramaram̐gaide taridību vuṭṭunā
śhirasĕtti navvam̐gāne siṁtalĕlla mānum̐gāga
karigari sesugŏṁṭe kaivasamulaunā

(||paṭṭina||)
tappaga sūḍam̐gāne tagulāyamaum̐ gāga
rĕppalu mūsugŏṁṭe rem̐gunā tami
yippuḍe śhrīveṁkaḍeśhunĕnasidi viḍuvalĕ
mĕppiṁchagunna nerbulu mikkili mĕrasunā