Pattina salamudodam baigoneeni

పట్టిన చలముతోడఁ బైకొనీని
Language

(॥పల్లవి॥)
పట్టిన చలముతోడఁ బైకొనీని
దిట్టగదే పేరువళి తిరువెంగళప్పఁడు

(॥పట్టి॥)
విరహపుకాఁకచేత వేసరి నేఁ గసరితే
గరిమ నవ్వులు నవ్వి కాఁగిలించీని
సరసము లాడీని సాదనలు సేసీని
తెరలోనే పేరువళి తిరు వెంగళప్పఁడు

(॥పట్టి॥)
వెలిఁ దనచేఁత విని వెఁ దలవంచుకొంటే
బలిమిఁ జెక్కులు నొక్కి పచ్చిసేసీని
తొలుతే వేడుకకాఁడు దొ మెరఁగఁడనేది
తెలిపెఁగా పేరువళి తిరువెంగళప్పఁడు

(॥పట్టి॥)
కావిరి నే మొకమోడి కదిసి నే నిలుచుంటే
కోవరపు వలపులఁ గొంగు వట్టీని
చేవదేర నన్నుఁ గూడె శ్రీవేంకటాద్రి మీఁదిఁ
దేవుఁడే పో పేరువళి తిరువెంగళప్పఁడు

(||pallavi||)
paṭṭina salamudoḍam̐ baigŏnīni
diṭṭagade peruvaḽi tiruvĕṁgaḽappam̐ḍu

(||paṭṭi||)
virahabugām̐kaseda vesari nem̐ gasaride
garima navvulu navvi kām̐giliṁchīni
sarasamu lāḍīni sādanalu sesīni
tĕralone peruvaḽi tiru vĕṁgaḽappam̐ḍu

(||paṭṭi||)
vĕlim̐ danasem̐ta vini vĕm̐ dalavaṁchugŏṁṭe
balimim̐ jĕkkulu nŏkki pachchisesīni
tŏlude veḍugagām̐ḍu dŏ mĕram̐gam̐ḍanedi
tĕlibĕm̐gā peruvaḽi tiruvĕṁgaḽappam̐ḍu

(||paṭṭi||)
kāviri ne mŏgamoḍi kadisi ne nilusuṁṭe
kovarabu valabulam̐ gŏṁgu vaṭṭīni
sevadera nannum̐ gūḍĕ śhrīveṁkaḍādri mīm̐dim̐
devum̐ḍe po peruvaḽi tiruvĕṁgaḽappam̐ḍu