పట్టిన చలమేకాక పంతమిచ్చేనా
(॥పల్లవి॥)
పట్టిన చలమేకాక పంతమిచ్చేనా
తిట్టితేఁ దిట్టుదుఁగాక దీవించేనా
(॥పట్టిన॥)
నన్నుఁ దానట్టే చూడఁగ నవ్వితేనేమాయ
విన్నకన్నచెలులాల వెంగెమా యిది
పిన్నదాననంటానే పిలిచి వాదుకు వచ్చీ
యెన్ని చెప్పినాఁ దనకు యింక లోఁగేనా
(॥పట్టిన॥)
వొడివట్టి తియ్యఁగాను వోపనంటేనేమాయ
కడనున్న సతులాల కానిదా యిది
బడలినవేళనే పట్టి పెనఁగవలెనా
వడఁబడుఁగాక తనవద్దకి వచ్చేనా
(॥పట్టిన॥)
తావుకుఁ దా రాఁగాను తలవంచితేనేమాయ
వోవో పొరుగువార వొరటా యిది
శ్రీవేంకటేశ్వరుఁడు చేరి తానె నన్నుఁగూడె
యీవల నలమేల్‌మంగ నెదురాడేనా
(||pallavi||)
paṭṭina salamegāga paṁtamichchenā
tiṭṭidem̐ diṭṭudum̐gāga dīviṁchenā
(||paṭṭina||)
nannum̐ dānaṭṭe sūḍam̐ga navvidenemāya
vinnagannasĕlulāla vĕṁgĕmā yidi
pinnadānanaṁṭāne pilisi vādugu vachchī
yĕnni sĕppinām̐ danagu yiṁka lom̐genā
(||paṭṭina||)
vŏḍivaṭṭi tiyyam̐gānu vobanaṁṭenemāya
kaḍanunna sadulāla kānidā yidi
baḍalinaveḽane paṭṭi pĕnam̐gavalĕnā
vaḍam̐baḍum̐gāga tanavaddagi vachchenā
(||paṭṭina||)
tāvugum̐ dā rām̐gānu talavaṁchidenemāya
vovo pŏruguvāra vŏraḍā yidi
śhrīveṁkaḍeśhvarum̐ḍu seri tānĕ nannum̐gūḍĕ
yīvala nalamelmaṁga nĕdurāḍenā