Pattina pamtame baluvanave

పట్టిన పంతమె బలువనవే
Language

(॥పల్లవి॥)
పట్టిన పంతమె బలువనవే
చుట్టపు వరుసలు చూచితిననవే

(॥పట్టి॥)
తానూఁ జూచెను తనువూ నాఁటెను
కానీకానీ కద్దనవే
నానితిఁ జెమటల నవ్వుల మునిఁగితి
పూని యిద్దరికిఁ బోదనవే

(॥పట్టి॥)
మారు మాఁటాడెను మనసున నిలిచెను
ఆరీఁ దేరీ నవుననవే
తీరవు పులకలు తెగదిది తమకము
భారము దనపైఁ బడెననవే

(॥పట్టి॥)
కాఁగిటఁ గూడెను కళలను గరఁగితి
దాఁగనేల యిఁకఁ దగుననవే
వీఁగనైతి శ్రీవేంకటపతి రతి
చేఁగదేరె నిఁకఁ జెల్లుబడనవే

(||pallavi||)
paṭṭina paṁtamĕ baluvanave
suṭṭabu varusalu sūsidinanave

(||paṭṭi||)
tānūm̐ jūsĕnu tanuvū nām̐ṭĕnu
kānīgānī kaddanave
nānidim̐ jĕmaḍala navvula munim̐gidi
pūni yiddarigim̐ bodanave

(||paṭṭi||)
māru mām̐ṭāḍĕnu manasuna nilisĕnu
ārīm̐ derī navunanave
tīravu pulagalu tĕgadidi tamagamu
bhāramu danabaim̐ baḍĕnanave

(||paṭṭi||)
kām̐giḍam̐ gūḍĕnu kaḽalanu garam̐gidi
dām̐ganela yim̐kam̐ dagunanave
vīm̐ganaidi śhrīveṁkaḍabadi radi
sem̐gaderĕ nim̐kam̐ jĕllubaḍanave