Pattide padiroobulai paayamdu naa voddamdaagu

పట్టితే పదిరూపులై పాయఁడు నా వొద్దఁదాగు
Language

(॥పల్లవి॥)
పట్టితే పదిరూపులై పాయఁడు నా వొద్దఁదాగు
యెట్టు వున్న మేలు ఇఁక నెప్పుడైనా రానీవే

(॥పట్టి॥)
కన్నులనే వొకరూపు కాళ్లఁ బెనఁగీ రూపు
వెన్నెలాఁ దురుమువంటి వన్నెల రూపు
నెన్నడిమి దొకరూపు నిచ్చలు నామేని మీఁద
ఇన్నిటాఁ బాయఁడు తాను యెప్పుడైనా రానీవే

(॥పట్టి॥)
చేతిలోని దొకరూపు చేరి నాపేరిటిరూపు
కాతరపు జవ్వనానఁ గలఁడు రూపు
పై తరవైనా బుజబలమున నొకరూపు
యీతల నాయందుఁ బాయఁ డెప్పుడైనా రానీవే

(॥పట్టి॥)
కడుబుద్దుల నొకరూపు కలికితనాలరూపు
బడిఁబడిఁ బాసినాను పాయఁడు నన్ను
అడరి శ్రీవేంకటాద్రిమీఁద నను గూడి
యెడయ డెన్నివిధాల నెప్పుడైనా రానీవే

(||pallavi||)
paṭṭide padirūbulai pāyam̐ḍu nā vŏddam̐dāgu
yĕṭṭu vunna melu im̐ka nĕppuḍainā rānīve

(||paṭṭi||)
kannulane vŏgarūbu kāḽlam̐ bĕnam̐gī rūbu
vĕnnĕlām̐ durumuvaṁṭi vannĕla rūbu
nĕnnaḍimi dŏgarūbu nichchalu nāmeni mīm̐da
inniḍām̐ bāyam̐ḍu tānu yĕppuḍainā rānīve

(||paṭṭi||)
sediloni dŏgarūbu seri nāberiḍirūbu
kādarabu javvanānam̐ galam̐ḍu rūbu
pai taravainā bujabalamuna nŏgarūbu
yīdala nāyaṁdum̐ bāyam̐ ḍĕppuḍainā rānīve

(||paṭṭi||)
kaḍubuddula nŏgarūbu kaligidanālarūbu
baḍim̐baḍim̐ bāsinānu pāyam̐ḍu nannu
aḍari śhrīveṁkaḍādrimīm̐da nanu gūḍi
yĕḍaya ḍĕnnividhāla nĕppuḍainā rānīve