Pattide naado pani padiyum badi | itte

పట్టితే నాతో పని పదియుఁ బది । ఇట్టె
Language

(॥పల్లవి॥)
పట్టితే నాతో పని పదియుఁ బది । ఇట్టె
నెట్టుకొని నిలువుము నీవే నేను

(॥పట్టి॥)
వొరసి తప్పకచూచే వోతఁడా
తిరిగి యిట్టె తల దియ్యకుమీ
గిరిపితేఁ బోదింక కెరలీ పంతాలు
సరస నీనవ్వులెల్లా చక్కఁజేసే నిఁకను

(॥పట్టి॥)
అడుగు దియ్యకుమీ నీవంతేసి నీవు
గొడవల కియ్యకొంటేఁ గొంకేనా
అడవే మేడెము మాయంకెకు నీ-
వెడనీలికాసెకు వెఱతు నేను

(॥పట్టి॥)
మాఁటలపచారమేల మగవారికి
గాఁటపునీరాతిగుండె కంటి నేను
నేఁటనే శ్రీవేంకటేశ నిన్ను నన్ను వొకటిగా
తూఁటవిలుతుఁడు వచ్చి దొమ్మి సేసెఁగా

(||pallavi||)
paṭṭide nādo pani padiyum̐ badi | iṭṭĕ
nĕṭṭugŏni niluvumu nīve nenu

(||paṭṭi||)
vŏrasi tappagasūse vodam̐ḍā
tirigi yiṭṭĕ tala diyyagumī
giribidem̐ bodiṁka kĕralī paṁtālu
sarasa nīnavvulĕllā sakkam̐jese nim̐kanu

(||paṭṭi||)
aḍugu diyyagumī nīvaṁtesi nīvu
gŏḍavala kiyyagŏṁṭem̐ gŏṁkenā
aḍave meḍĕmu māyaṁkĕgu nī-
vĕḍanīligāsĕgu vĕṟadu nenu

(||paṭṭi||)
mām̐ṭalabasāramela magavārigi
gām̐ṭabunīrādiguṁḍĕ kaṁṭi nenu
nem̐ṭane śhrīveṁkaḍeśha ninnu nannu vŏgaḍigā
tūm̐ṭaviludum̐ḍu vachchi dŏmmi sesĕm̐gā