Patti penamgagurammaa padidoda selu lella

పట్టి పెనఁగకురమ్మా పతితోడ చెలు లెల్ల
Language

(॥పల్లవి॥)
పట్టి పెనఁగకురమ్మా పతితోడ చెలు లెల్ల
చుట్ట్టపు సూడుబంటును సూటికిఁ దేరాదు

(॥పట్టి॥)
చెలిమి సేయఁగ వచ్చుఁ జేకొని వలవుమంటా
బలిమి సేయఁగరాదు పైపైఁ బడి
వలవు మనఁగవచ్చు వలెనన్నచోటికి
చలము సాదించేవానిఁ జాయకుఁ దేరాదు

(॥పట్టి॥)
మాటలాడ వచ్చుఁ గాని మన సెందుఁ బారకుండా
మూట గట్ట రా దతనిముందు ముందే
గాటపు మనసు మూట గట్టవచ్చు నందులోన
నాటుకొని ప్రియములు నారు వోయరాదు

(॥పట్టి॥)
చనపు నెఱపఁగ వచ్చు సమ్మతించినచోటికే
మనవి చెప్పఁగ రాదు మాయవారితో
మనవి చెప్పఁగ వచ్చు మక్కువ శ్రీవేంకటేశుఁ
డెనసె నను నింక నే నెదురాడ రాదు

(||pallavi||)
paṭṭi pĕnam̐gagurammā padidoḍa sĕlu lĕlla
suṭṭṭabu sūḍubaṁṭunu sūḍigim̐ derādu

(||paṭṭi||)
sĕlimi seyam̐ga vachchum̐ jegŏni valavumaṁṭā
balimi seyam̐garādu paibaim̐ baḍi
valavu manam̐gavachchu valĕnannasoḍigi
salamu sādiṁchevānim̐ jāyagum̐ derādu

(||paṭṭi||)
māḍalāḍa vachchum̐ gāni mana sĕṁdum̐ bāraguṁḍā
mūḍa gaṭṭa rā dadanimuṁdu muṁde
gāḍabu manasu mūḍa gaṭṭavachchu naṁdulona
nāḍugŏni priyamulu nāru voyarādu

(||paṭṭi||)
sanabu nĕṟabam̐ga vachchu sammadiṁchinasoḍige
manavi sĕppam̐ga rādu māyavārido
manavi sĕppam̐ga vachchu makkuva śhrīveṁkaḍeśhum̐
ḍĕnasĕ nanu niṁka ne nĕdurāḍa rādu