Pattemdesi sannula paayaburaalavu neegu

పట్టెఁడేసి చన్నుల పాయపురాలవు నీకు
Language

(॥పల్లవి॥)
పట్టెఁడేసి చన్నుల పాయపురాలవు నీకు
గుట్టుసేసే వింత నీవు కొత్తదానవటవే

(॥పట్టె॥)
యిచ్చగించి నీమగఁడు యేకతాన నున్నవాఁడు
మచ్చికలు చూపవే మాటలాడవే
వచ్చివచ్చి సిగ్గువడి వాకిటనే వుందానవు
పెచ్చురేఁగ నింకా నీవు పిన్నదానవటవే

(॥పట్టె॥)
పొద్దువొక నీకుఁగానే పొంచుకొనివున్నవాడు
వొద్దఁ గూచుండవే పాదాలొత్తఁగదవే
అద్దో కొంగు వట్టుకోఁగా నండె నూరకుందానవు
బుద్దులేమి నెఱఁగని పూఁపదానవటవే

(॥పట్టె॥)
అలరి నీరతులకు నాసపడి వున్నవాఁడు
కలసి మెలఁగవే కాఁగిలించవే
అలమేలుమంగపతియైన శ్రీవేంకటేశ్వరు
లలిఁగూడి పెనఁగేవు లాఁతిదానవటవే

(||pallavi||)
paṭṭĕm̐ḍesi sannula pāyaburālavu nīgu
guṭṭusese viṁta nīvu kŏttadānavaḍave

(||paṭṭĕ||)
yichchagiṁchi nīmagam̐ḍu yegadāna nunnavām̐ḍu
machchigalu sūbave māḍalāḍave
vachchivachchi sigguvaḍi vāgiḍane vuṁdānavu
pĕchchurem̐ga niṁkā nīvu pinnadānavaḍave

(||paṭṭĕ||)
pŏdduvŏga nīgum̐gāne pŏṁchugŏnivunnavāḍu
vŏddam̐ gūsuṁḍave pādālŏttam̐gadave
addo kŏṁgu vaṭṭugom̐gā naṁḍĕ nūraguṁdānavu
buddulemi nĕṟam̐gani pūm̐padānavaḍave

(||paṭṭĕ||)
alari nīradulagu nāsabaḍi vunnavām̐ḍu
kalasi mĕlam̐gave kām̐giliṁchave
alamelumaṁgabadiyaina śhrīveṁkaḍeśhvaru
lalim̐gūḍi pĕnam̐gevu lām̐tidānavaḍave