Pattemdesi sannula paayabudaanavu

పట్టెఁడెసి చన్నుల పాయపుదానవు
Language

(॥పల్లవి॥)
పట్టెఁడెసి చన్నుల పాయపుదానవు
యెట్టు వేసాలు సేసేవే యిందరుఁ జూఁడగాను

(॥పట్టెఁ॥)
చెక్కిటి చేతితోడ సిగ్గులు వడేవేమే
అక్కరతో నాతఁడు మాఁటాడఁగాను
గుక్కుకొంటా వలపులు గుబ్బతిలే వది యేమే
చక్కెర మోవి చూపి సన్న సేయఁగాను

(॥పట్టెఁ॥)
సెలవుల నవ్వుకొంటా శిరసు వంచేవేమే
అలరి యాతఁడు చన్నులంటఁగాను
వులికి తీగెలు సాగ నూఁకొనే వది యేమే
పిలిచి యాతఁడు నిన్నుఁబేరుకొనఁగాను

(॥పట్టెఁ॥)
వెరగంది ముక్కుమీఁద వేలువెట్టే వది యేమే
తెరవేసు కాతఁడు నీ దిక్కు చూడఁగా
సరి నలమేలుమంగపు సాదించే వది యేమే
యిరవై శ్రీవేంకటేశుఁ డీతఁడు గూడఁగాను

(||pallavi||)
paṭṭĕm̐ḍĕsi sannula pāyabudānavu
yĕṭṭu vesālu seseve yiṁdarum̐ jūm̐ḍagānu

(||paṭṭĕm̐||)
sĕkkiḍi sedidoḍa siggulu vaḍeveme
akkarado nādam̐ḍu mām̐ṭāḍam̐gānu
gukkugŏṁṭā valabulu gubbadile vadi yeme
sakkĕra movi sūbi sanna seyam̐gānu

(||paṭṭĕm̐||)
sĕlavula navvugŏṁṭā śhirasu vaṁcheveme
alari yādam̐ḍu sannulaṁṭam̐gānu
vuligi tīgĕlu sāga nūm̐kŏne vadi yeme
pilisi yādam̐ḍu ninnum̐berugŏnam̐gānu

(||paṭṭĕm̐||)
vĕragaṁdi mukkumīm̐da veluvĕṭṭe vadi yeme
tĕravesu kādam̐ḍu nī dikku sūḍam̐gā
sari nalamelumaṁgabu sādiṁche vadi yeme
yiravai śhrīveṁkaḍeśhum̐ ḍīdam̐ḍu gūḍam̐gānu