Pattarairigaa mimmu badamtulu vaddanumde

పట్టరైరిగా మిమ్ము బడఁతులు వద్దనుండే
Language

(॥పల్లవి॥)
పట్టరైరిగా మిమ్ము బడఁతులు వద్దనుండే
వొట్టి చే ముట్టి సరసా లొద్దంటిఁ గా

(॥పట్టి॥)
పువ్వులచెండున వేసి పుప్పొడివాయల బడ
నొవ్వి బడే వేలే కన్నుల దిట్టుతా
అవ్వలివ్వలిమోములై యలిగితి రిద్దరు
నవ్వి నవ్వి జగడాలు నడుమనే వచ్చె గా

(॥పట్టి॥)
పక్కన నాతని నాడి పతి మాటాడించుకొని
చెక్కుచేతిచింత లేలే సిగ్గుపడుతా
మక్కళంపు మంకులతో మాటలాడ రిద్దరును
వొక్కటై యుండుండి మీకు నోరటులు వచ్చె గా

(॥పట్టి॥)
కుచ్చి కొనగొంగు వట్టికొప్పు జాఱ ది య్యించుక
పచ్చిగా గోపించే వేలే పగ చాటుతా
యిచ్చకు డై శ్రీవేంకటేశు డిట్టే నిన్ను గూడె
మచ్చరము లిందా కా మానకుండె గా

(||pallavi||)
paṭṭarairigā mimmu baḍam̐tulu vaddanuṁḍe
vŏṭṭi se muṭṭi sarasā lŏddaṁṭim̐ gā

(||paṭṭi||)
puvvulasĕṁḍuna vesi puppŏḍivāyala baḍa
nŏvvi baḍe vele kannula diṭṭudā
avvalivvalimomulai yaligidi riddaru
navvi navvi jagaḍālu naḍumane vachchĕ gā

(||paṭṭi||)
pakkana nādani nāḍi padi māḍāḍiṁchugŏni
sĕkkusedisiṁta lele siggubaḍudā
makkaḽaṁpu maṁkulado māḍalāḍa riddarunu
vŏkkaḍai yuṁḍuṁḍi mīgu noraḍulu vachchĕ gā

(||paṭṭi||)
kuchchi kŏnagŏṁgu vaṭṭigŏppu jāṟa di yyiṁchuga
pachchigā gobiṁche vele paga sāḍudā
yichchagu ḍai śhrīveṁkaḍeśhu ḍiṭṭe ninnu gūḍĕ
machcharamu liṁdā kā mānaguṁḍĕ gā