(॥పల్లవి॥)
పట్టరాని వయసుల పంతగాఁడవు
బట్టబయలు సిగ్గులు పందేలా యేమి
(॥పట్టి॥)
వువిదమాటలకే వొడ్డుకొనే వింతలోనే
అవి చెఱకుసింగిణి యంపగములా
తవిలి నవ్వితే నేల తల దీసుకొనేవు
వివరింప వెన్నెలల వేఁడులా యేమి
(॥పట్టి॥)
వెలఁది చూపులకేల వీఁగేవంతటిలోనే
మెలుపున నవే తుమ్మిదపౌఁజులా
కొలఁదిసరసముల గోరులకేల లోఁగేవు
ములువాఁడి చేకత్తుల మొనలా యేమి
(॥పట్టి॥)
అంగనరతులకేల అలసే వింతటిలోనే
సంగతి మరుగరిడిసాములా యవి
రంగుగ శ్రీవేంకటేశ రమణిఁ గూడితివిట్టే
పంగించని సంసార ఫలమా యేమి
(||pallavi||)
paṭṭarāni vayasula paṁtagām̐ḍavu
baṭṭabayalu siggulu paṁdelā yemi
(||paṭṭi||)
vuvidamāḍalage vŏḍḍugŏne viṁtalone
avi sĕṟagusiṁgiṇi yaṁpagamulā
tavili navvide nela tala dīsugŏnevu
vivariṁpa vĕnnĕlala vem̐ḍulā yemi
(||paṭṭi||)
vĕlam̐di sūbulagela vīm̐gevaṁtaḍilone
mĕlubuna nave tummidabaum̐julā
kŏlam̐disarasamula gorulagela lom̐gevu
muluvām̐ḍi segattula mŏnalā yemi
(||paṭṭi||)
aṁganaradulagela alase viṁtaḍilone
saṁgadi marugariḍisāmulā yavi
raṁguga śhrīveṁkaḍeśha ramaṇim̐ gūḍidiviṭṭe
paṁgiṁchani saṁsāra phalamā yemi