Pattaraani vayasudo balimi sesemugaaga

పట్టరాని వయసుతో బలిమి సేసేముగాక
Language

(॥పల్లవి॥)
పట్టరాని వయసుతో బలిమి సేసేముగాక
యెట్టు నేఁడు బాఁతియై రితరులు నీకు

(॥పట్ట॥)
భామినిమాటలెల్ల పంచమవేదము నీకు
ప్రేమపుమోవితేనె పెండ్లివిందులు
సాముసేసేటిగరిడి సతమైనకాఁగిలి
యేమిటికి మాటలాడే వెవ్వరితో నీవు

(॥పట్ట॥)
అంగనతోడి సరస మంకెల రాజ్యపదవి
సంగడినవ్వులు నీజన్మఫలము
ముగిటిధానాలు మొనగోరి సరసాలు
యెంగిలివలపులేల యెవ్వరితో నీకు

(॥పట్ట॥)
కాంతపురమె నీకు కందువ సింహాసనము
పంతపుకూటములే పట్టబద్ధము
ఇంతలో శ్రీవేంకటేశ యేలితివి నన్ను నిట్టె
యెంత కెంత సడ్డయేల యెవ్వరితో నీకు

(||pallavi||)
paṭṭarāni vayasudo balimi sesemugāga
yĕṭṭu nem̐ḍu bām̐tiyai ridarulu nīgu

(||paṭṭa||)
bhāminimāḍalĕlla paṁchamavedamu nīgu
premabumovidenĕ pĕṁḍliviṁdulu
sāmuseseḍigariḍi sadamainagām̐gili
yemiḍigi māḍalāḍe vĕvvarido nīvu

(||paṭṭa||)
aṁganadoḍi sarasa maṁkĕla rājyabadavi
saṁgaḍinavvulu nījanmaphalamu
mugiḍidhānālu mŏnagori sarasālu
yĕṁgilivalabulela yĕvvarido nīgu

(||paṭṭa||)
kāṁtaburamĕ nīgu kaṁduva siṁhāsanamu
paṁtabugūḍamule paṭṭabaddhamu
iṁtalo śhrīveṁkaḍeśha yelidivi nannu niṭṭĕ
yĕṁta kĕṁta saḍḍayela yĕvvarido nīgu