పట్టరాని సంసారము బయలువందిలి యిది
(॥పల్లవి॥)
పట్టరాని సంసారము బయలువందిలి యిది
మట్టుతో నీ జీవుఁ డెట్టు మాయ గడచీని
(॥పట్టరా॥)
నేతిబీరకాయ నెట్టనఁ గర్మబంధము
బూతుచిల్లినేస్త మెప్పుడు మనసు
ఱాతితో గిలిగింత యాఱడిసతుల పొందులు
యేతులను యీ జీవుఁ డెట్టు వేఁగించీని
(॥పట్టరా॥)
గొంగడిఁ గట్టిన చద్ది గుఱిలేని భోగము
బంగారు గట్టిన పాఁత పాయని యాస
అంగడిగట్టిన యద్ద మాగడమైన బదుకు
పొంగుచు నీ జీవుఁ డెట్టు బుద్ది యెఱిఁగీని
(॥పట్టరా॥)
పున్నిమ వెన్నెల పోగు పోలింనిరానిసంపద
వన్నె నద్దినట్టి బాయ వలపురతి
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డేలెఁ గాక యిన్నాళ్లు
మిన్నక యీ జీవుఁ డెట్టు మేర దెలిసీని
(||pallavi||)
paṭṭarāni saṁsāramu bayaluvaṁdili yidi
maṭṭudo nī jīvum̐ ḍĕṭṭu māya gaḍasīni
(||paṭṭarā||)
nedibīragāya nĕṭṭanam̐ garmabaṁdhamu
būdusillinesta mĕppuḍu manasu
ṟādido giligiṁta yāṟaḍisadula pŏṁdulu
yedulanu yī jīvum̐ ḍĕṭṭu vem̐giṁchīni
(||paṭṭarā||)
gŏṁgaḍim̐ gaṭṭina saddi guṟileni bhogamu
baṁgāru gaṭṭina pām̐ta pāyani yāsa
aṁgaḍigaṭṭina yadda māgaḍamaina badugu
pŏṁgusu nī jīvum̐ ḍĕṭṭu buddi yĕṟim̐gīni
(||paṭṭarā||)
punnima vĕnnĕla pogu poliṁnirānisaṁpada
vannĕ naddinaṭṭi bāya valaburadi
yinniḍā śhrīveṁkaḍeśhum̐ ḍelĕm̐ gāga yinnāḽlu
minnaga yī jīvum̐ ḍĕṭṭu mera dĕlisīni