Pattamu gattidi vimka bradugarayyaa

పట్టము గట్టితి వింక బ్రతుకరయ్యా
Language

(॥పల్లవి॥)
పట్టము గట్టితి వింక బ్రతుకరయ్యా
చిట్టకాలు లేవు మీకు శ్రీవేంకటేశుఁడా

(॥పట్ట॥)
అలమేలుమంగకు సింహ్వాసనము నీవురము
కలితహారములే సింగారపుదండలు
తొలఁకునీహస్తములే తోరణగంభములు
చెలిరాజ్యమే నీవు శ్రీవేంకటేశుఁడా

(॥పట్ట॥)
పరగుతులసిదండ పచ్చతోరణ మాపెకు
మెరుఁగుఁ గౌస్తుభమణి మించుటద్దము
గరిమ నీసొబగులు కప్పములుఁ గానికలు
సిరులు నీకూరిములు శ్రీవేంకటేశుఁడా

(॥పట్ట॥)
సంతతమైనవిందులు సారె నీమోవితేనెలు
వింతరతిభోగములు వినోదాలు
కొంత నియ్యారును బొడ్డు కుంచెయుఁ గాళాఁజి
చెంతల నన్నీ నమరె శ్రీవేంకటేశుఁడా

(||pallavi||)
paṭṭamu gaṭṭidi viṁka bradugarayyā
siṭṭagālu levu mīgu śhrīveṁkaḍeśhum̐ḍā

(||paṭṭa||)
alamelumaṁgagu siṁhvāsanamu nīvuramu
kalidahāramule siṁgārabudaṁḍalu
tŏlam̐kunīhastamule toraṇagaṁbhamulu
sĕlirājyame nīvu śhrīveṁkaḍeśhum̐ḍā

(||paṭṭa||)
paragudulasidaṁḍa pachchadoraṇa mābĕgu
mĕrum̐gum̐ gaustubhamaṇi miṁchuḍaddamu
garima nīsŏbagulu kappamulum̐ gānigalu
sirulu nīgūrimulu śhrīveṁkaḍeśhum̐ḍā

(||paṭṭa||)
saṁtadamainaviṁdulu sārĕ nīmovidenĕlu
viṁtaradibhogamulu vinodālu
kŏṁta niyyārunu bŏḍḍu kuṁchĕyum̐ gāḽām̐ji
sĕṁtala nannī namarĕ śhrīveṁkaḍeśhum̐ḍā