Pattaguraa naaseṟamgu balimi neevu

పట్టకురా నాచెఱఁగు బలిమి నీవు
Language

(॥పల్లవి॥)
పట్టకురా నాచెఱఁగు బలిమి నీవు
వట్టిమాట లింతయేల వచ్చే విడువరా

(॥పట్ట॥)
మోవితీపె కడునైతే మొగచాటు గాకుండునా
నీవద్ద నేనుండఁగాను నీకుఁ జవులవునా
తావునఁ బోతావచ్చేతరితీపే మేలుగాక
వావిరి రమ్మన్నప్పుడే వచ్చే విడువరా

(॥పట్ట॥)
చేరి యగ్ని పొంత నుంటే చెమరించకుండునా
సారె నీతోఁ బెనఁగ వేసట మానీనా
తీరక సోఁకీసోఁకవితేఁకువే మేలుగాక
వారక నావరుసైతే వచ్చే విడువరా

(॥పట్ట॥)
నిండునీట నుంటేఁ దమ్యి నెగడక వనునా
మెండునీవు ననుఁ గూడి మెచ్చకుండేవా
అండనే శ్రీవేంకటేశ అటు నన్నుఁ గూడితివి
వండ వండనట్టూలయ్యీ వచ్చే విడువరా

(||pallavi||)
paṭṭagurā nāsĕṟam̐gu balimi nīvu
vaṭṭimāḍa liṁtayela vachche viḍuvarā

(||paṭṭa||)
movidībĕ kaḍunaide mŏgasāḍu gāguṁḍunā
nīvadda nenuṁḍam̐gānu nīgum̐ javulavunā
tāvunam̐ bodāvachchedaridībe melugāga
vāviri rammannappuḍe vachche viḍuvarā

(||paṭṭa||)
seri yagni pŏṁta nuṁṭe sĕmariṁchaguṁḍunā
sārĕ nīdom̐ bĕnam̐ga vesaḍa mānīnā
tīraga som̐kīsom̐kavidem̐kuve melugāga
vāraga nāvarusaide vachche viḍuvarā

(||paṭṭa||)
niṁḍunīḍa nuṁṭem̐ damyi nĕgaḍaga vanunā
mĕṁḍunīvu nanum̐ gūḍi mĕchchaguṁḍevā
aṁḍane śhrīveṁkaḍeśha aḍu nannum̐ gūḍidivi
vaṁḍa vaṁḍanaṭṭūlayyī vachche viḍuvarā