పట్టకురా ముట్టకురా పసలేని పనులకు
(॥పల్లవి॥)
పట్టకురా ముట్టకురా పసలేని పనులకు
యెట్టువలసినా వచ్చు నిదివో చేసన్నలు
(॥॥)
అంతనవ్వు నవ్వకురా అలవాటయ్యీ నీకు
బంతినే రాఁగా రాఁగా భావము లౌను
రంతులు సేయకురా రచ్చకెక్కీఁ బనులెల్లా
ఇంతటిమీఁదటి పను లిపుడే చెప్పేను
(॥॥)
నన్ను నంతమెచ్చకురా నాటకమే నిజమౌను
నిన్ను నన్ను నెంచుకొంటే నిక్కము లౌను
మిన్నక దగ్గరకురా మితిమీరుఁ దమకము
కన్నసుద్ది చెప్పకున్న కడుఁగడుదోసము
(॥॥)
వోరగండ్లఁ జూడకురా వుపమే నెపమౌను
సారెకు రతులమీఁద చలమెక్కును
యేరా శ్రీవేంకటేశ యింతలో నన్నుఁగూడితి
కోరిన కోరికలెల్లా గొఱఁత లేదిఁకను
(||pallavi||)
paṭṭagurā muṭṭagurā pasaleni panulagu
yĕṭṭuvalasinā vachchu nidivo sesannalu
(||||)
aṁtanavvu navvagurā alavāḍayyī nīgu
baṁtine rām̐gā rām̐gā bhāvamu launu
raṁtulu seyagurā rachchagĕkkīm̐ banulĕllā
iṁtaḍimīm̐daḍi panu libuḍe sĕppenu
(||||)
nannu naṁtamĕchchagurā nāḍagame nijamaunu
ninnu nannu nĕṁchugŏṁṭe nikkamu launu
minnaga daggaragurā midimīrum̐ damagamu
kannasuddi sĕppagunna kaḍum̐gaḍudosamu
(||||)
voragaṁḍlam̐ jūḍagurā vubame nĕbamaunu
sārĕgu radulamīm̐da salamĕkkunu
yerā śhrīveṁkaḍeśha yiṁtalo nannum̐gūḍidi
korina korigalĕllā gŏṟam̐ta ledim̐kanu