Pattaguraa amta neevu paniledu

పట్టకురా అంత నీవు పనిలేదు
Language

(॥పల్లవి॥)
పట్టకురా అంత నీవు పనిలేదు
దిట్టనై నీగుణమెల్లాఁ దెలిసినమీఁదను

(॥పట్టి॥)
చెక్కునొక్కాఁ బనిలేదు సేసవెట్టఁ బనిలేదు
గక్కన నే నలిగినకాఁకమీఁదను
నిక్కిచూడాఁ బనిలేదు నిలుచుండాఁ బనిలేదు
తక్కించి నీవు రాక తడసినమీఁదను

(॥పట్టి॥)
నవ్వు నవ్వాఁ బనిలేదు నాఁటజూఁడా బనిలేదు
దవ్వులుగ బొంకినయంతటిమీదను
రవ్వసేయాఁ బనిలేదు రాజసాలూఁ బనిలేదు
పవ్వళించి పానుపుపైఁ బలుకనిమీఁదను

(॥పట్టి॥)
కాఁగిలించాఁ బనిలేదు కరఁగించాఁ బనిలేదు
మాఁగినరతుల నన్ను మన్నించుమీఁద
దాఁగక శ్రీవేంకటేశ తగ నన్నుఁ గూడితివి
వీఁగ నిఁకఁ బనిలేదు వేడుకలమీఁదను

(||pallavi||)
paṭṭagurā aṁta nīvu paniledu
diṭṭanai nīguṇamĕllām̐ dĕlisinamīm̐danu

(||paṭṭi||)
sĕkkunŏkkām̐ baniledu sesavĕṭṭam̐ baniledu
gakkana ne naliginagām̐kamīm̐danu
nikkisūḍām̐ baniledu nilusuṁḍām̐ baniledu
takkiṁchi nīvu rāga taḍasinamīm̐danu

(||paṭṭi||)
navvu navvām̐ baniledu nām̐ṭajūm̐ḍā baniledu
davvuluga bŏṁkinayaṁtaḍimīdanu
ravvaseyām̐ baniledu rājasālūm̐ baniledu
pavvaḽiṁchi pānububaim̐ baluganimīm̐danu

(||paṭṭi||)
kām̐giliṁchām̐ baniledu karam̐giṁchām̐ baniledu
mām̐ginaradula nannu manniṁchumīm̐da
dām̐gaga śhrīveṁkaḍeśha taga nannum̐ gūḍidivi
vīm̐ga nim̐kam̐ baniledu veḍugalamīm̐danu