పట్టకు పట్టకురా నా పయ్యదకొంగు
(॥పల్లవి॥)
పట్టకు పట్టకురా నా పయ్యదకొంగు
వెట్టివలపులు నాపై వెదచల్లవలెనా
(॥పట్టి॥)
యింత నీవు నేసినందు కిట్టె నిన్నుఁగూడితేను
యెంత బతిమాలెనని యెంచరా నన్ను
కొంతగొంత నిన్ను నింకాఁ గూరిమి గొసరఁబోతే
యింతులెల్లా నన్నుఁ జూచి యెకసక్కెమాడరా
(॥పట్టి॥)
యీవేళ నే నీకు యిచ్చకము లాడితేను
నావంటివారుచూచి నవ్వరా నన్ను
వాని చూచి నీతో నేను వాసికిఁ బెనఁగఁబోతే
ఆవలీవలి సతులాడరానన్ను
(॥పట్టి॥)
మొక్కి నీవు వేఁడుకోఁగా మొగమైనాఁ జూడకుంటే
దిక్కుల కామినులెల్లాఁ దిట్టరా నన్ను
చక్కని శ్రీవేంకటేశ సమ్మతిగఁ గూడితివి
చిక్కినసతులు గోరనేయరా నన్ను
(||pallavi||)
paṭṭagu paṭṭagurā nā payyadagŏṁgu
vĕṭṭivalabulu nābai vĕdasallavalĕnā
(||paṭṭi||)
yiṁta nīvu nesinaṁdu kiṭṭĕ ninnum̐gūḍidenu
yĕṁta badimālĕnani yĕṁcharā nannu
kŏṁtagŏṁta ninnu niṁkām̐ gūrimi gŏsaram̐bode
yiṁtulĕllā nannum̐ jūsi yĕgasakkĕmāḍarā
(||paṭṭi||)
yīveḽa ne nīgu yichchagamu lāḍidenu
nāvaṁṭivārusūsi navvarā nannu
vāni sūsi nīdo nenu vāsigim̐ bĕnam̐gam̐bode
āvalīvali sadulāḍarānannu
(||paṭṭi||)
mŏkki nīvu vem̐ḍugom̐gā mŏgamainām̐ jūḍaguṁṭe
dikkula kāminulĕllām̐ diṭṭarā nannu
sakkani śhrīveṁkaḍeśha sammadigam̐ gūḍidivi
sikkinasadulu goraneyarā nannu