పట్టకు నీవంతేసి బలిమిసేసి
(॥పల్లవి॥)
పట్టకు నీవంతేసి బలిమిసేసి
తిట్టపెట్టి నీవు దిద్దినదానఁగానా
(॥పట్ట॥)
సన్నలేల సేసేవు సారెకు నీవు నాతో
కన్నదేకాదా నీతో కాఁపుర మెల్లా
చన్నులేల యంటేవు సతులముందర నెల్లా
పిన్ననాఁట నుండి నీవు పెంచినవేకావా
(॥పట్ట॥)
నగవులేల నగేవు నయగారితనముల
మొగముచూచి నీకు మొక్కితిఁగాదా
జిగి విడెమేలిచ్చేవు చెలఁగి నీతములము
పొగరుల నున్నది నాపుక్కిటనే కాదా
(॥పట్ట॥)
బాసలేల సేసేవు పలుమారునింకా నీవు
సేసలు వెట్టినది నాశిరసేకాదా
వాసితో శ్రీవేంటేశ నన్నుఁ గూడితివి
ఆసపడినది నాయఁగ మిదె కాదా
(||pallavi||)
paṭṭagu nīvaṁtesi balimisesi
tiṭṭabĕṭṭi nīvu diddinadānam̐gānā
(||paṭṭa||)
sannalela sesevu sārĕgu nīvu nādo
kannadegādā nīdo kām̐pura mĕllā
sannulela yaṁṭevu sadulamuṁdara nĕllā
pinnanām̐ṭa nuṁḍi nīvu pĕṁchinavegāvā
(||paṭṭa||)
nagavulela nagevu nayagāridanamula
mŏgamusūsi nīgu mŏkkidim̐gādā
jigi viḍĕmelichchevu sĕlam̐gi nīdamulamu
pŏgarula nunnadi nābukkiḍane kādā
(||paṭṭa||)
bāsalela sesevu palumāruniṁkā nīvu
sesalu vĕṭṭinadi nāśhirasegādā
vāsido śhrīveṁṭeśha nannum̐ gūḍidivi
āsabaḍinadi nāyam̐ga midĕ kādā