పట్టకు నన్ను బలిమిఁ బదవే నీవు
(॥పల్లవి॥)
పట్టకు నన్ను బలిమిఁ బదవే నీవు
అట్టె యానలు వెట్టే వదేమే నీకింత
(॥పట్ట॥)
కడు నిందరియెదులు కాకుగాఁ బేరెలుపున
బడి నన్నుఁ బిలువక పదవే నూవు
యెడ సెలిగతినంటా యీడ కాతనిఁ బిలిచే
వడరి వద్దన్న మాన వదేమే నీకింత
(॥పట్ట॥)
మరిగిన మగవాని మాపేరు దలఁపించి
పరగ వచ్చేఁగాని పదవే నీవు
దొరచేతి నిమ్మపండు దూరుగా నా కిచ్చేవు
అరసేవు మా మనసు అదేమే నీకింత
(॥పట్ట॥)
గట్టున శ్రీవేంకటేశుఁ గూరిచితి విటు నన్ను
పట్టినచలము చెల్లెఁ బదవే నీవే
వొట్టి జాణతనా లొకటొకటే యాతనితోడ
అట్టె కేరుచుఁ జెప్పేవు అదేమే నీకింత
(||pallavi||)
paṭṭagu nannu balimim̐ badave nīvu
aṭṭĕ yānalu vĕṭṭe vademe nīgiṁta
(||paṭṭa||)
kaḍu niṁdariyĕdulu kāgugām̐ berĕlubuna
baḍi nannum̐ biluvaga padave nūvu
yĕḍa sĕligadinaṁṭā yīḍa kādanim̐ bilise
vaḍari vaddanna māna vademe nīgiṁta
(||paṭṭa||)
marigina magavāni māberu dalam̐piṁchi
paraga vachchem̐gāni padave nīvu
dŏrasedi nimmabaṁḍu dūrugā nā kichchevu
arasevu mā manasu ademe nīgiṁta
(||paṭṭa||)
gaṭṭuna śhrīveṁkaḍeśhum̐ gūrisidi viḍu nannu
paṭṭinasalamu sĕllĕm̐ badave nīve
vŏṭṭi jāṇadanā lŏgaḍŏgaḍe yādanidoḍa
aṭṭĕ kerusum̐ jĕppevu ademe nīgiṁta