Pattagu nannimkanu badalidi nannidaanu

పట్టకు నన్నిఁకను బడలితి నన్నిటాను
Language

(॥పల్లవి॥)
పట్టకు నన్నిఁకను బడలితి నన్నిటాను
చుట్టిరికమున నే సొలసేఁ గాని

(॥పట్టి॥)
జగడ మడువ నోప సాకిరి పట్టఁగ నోప
మొగము చూచి నీకు మొక్కే నేను
తగవులు చెప్పనోప తప్పులు వట్టఁగ నోప
జిగి నీపాదాలసేవ సేసేఁగాని

(॥పట్టి॥)
ఆనలు వెట్టఁగ నోప ఆఱడిఁ బడఁగ నోప
పూని మంచిదాననై పొగడే నేను
ఆనుక జంకించ నోప ఆసలు చూపఁగ నోప
కానుకిచ్చి నీచేఁతకు లోనవుండేఁ గాని

(॥పట్టి॥)
బొమ్మల జంకించనోప పొద్దులు గడప నోప
చిమ్ముచు సేసవెట్టి చెనకే నేను
నెమ్మది శ్రీ వేంకటేశ నే నలమేలుమంగను
సమ్మతించి నీమోవి చవిగొనేఁ గాని

(||pallavi||)
paṭṭagu nannim̐kanu baḍalidi nanniḍānu
suṭṭirigamuna ne sŏlasem̐ gāni

(||paṭṭi||)
jagaḍa maḍuva noba sāgiri paṭṭam̐ga noba
mŏgamu sūsi nīgu mŏkke nenu
tagavulu sĕppanoba tappulu vaṭṭam̐ga noba
jigi nībādālaseva sesem̐gāni

(||paṭṭi||)
ānalu vĕṭṭam̐ga noba āṟaḍim̐ baḍam̐ga noba
pūni maṁchidānanai pŏgaḍe nenu
ānuga jaṁkiṁcha noba āsalu sūbam̐ga noba
kānugichchi nīsem̐tagu lonavuṁḍem̐ gāni

(||paṭṭi||)
bŏmmala jaṁkiṁchanoba pŏddulu gaḍaba noba
simmusu sesavĕṭṭi sĕnage nenu
nĕmmadi śhrī veṁkaḍeśha ne nalamelumaṁganu
sammadiṁchi nīmovi savigŏnem̐ gāni