Pattabudevulavu praanabamdhuvuraalavu

పట్టపుదేవులవు ప్రాణబంధువురాలవు
Language

(॥పల్లవి॥)
పట్టపుదేవులవు ప్రాణబంధువురాలవు
అట్టె ఇయ్యకొనవద్దా అంగన ఇదేమే

(॥పట్ట॥)
చేతులు పట్టుక నిన్ను చెక్కు నొక్కీ రమ్మంటాను
ఘాతల నింతటనై నాఁ గలయవద్దా
ఆతఁడు బాగా లిచ్చి ఆకు మడి చియ్యఁజూచి
ఱాతిమనసా రమణి ఱట్టు నీ కిదేమే

(॥పట్ట॥)
విందుగా మోవి చూపి వేఁడుకోనీ సారెసారె
ముందుముందే యతనికి మొక్కవద్దా
కుందుక చనవుసేసి కొంగు వట్టుకున్న వాఁడు
మందెమేళమా నీకు మగువ ఇదేమే

(॥పట్ట॥)
కన్నుల నవ్వులు నవ్వి కాఁగిలించుకున్న వాఁడు
మిన్నక రతుల నిట్టె మెప్పించవద్దా
యిన్నిటా శ్రీవేంకటేశుఁ డెనసె ని న్నింతలోనె
కన్నెపడుచువా నీవు కలికి విదేమే

(||pallavi||)
paṭṭabudevulavu prāṇabaṁdhuvurālavu
aṭṭĕ iyyagŏnavaddā aṁgana ideme

(||paṭṭa||)
sedulu paṭṭuga ninnu sĕkku nŏkkī rammaṁṭānu
ghādala niṁtaḍanai nām̐ galayavaddā
ādam̐ḍu bāgā lichchi āgu maḍi siyyam̐jūsi
ṟādimanasā ramaṇi ṟaṭṭu nī kideme

(||paṭṭa||)
viṁdugā movi sūbi vem̐ḍugonī sārĕsārĕ
muṁdumuṁde yadanigi mŏkkavaddā
kuṁduga sanavusesi kŏṁgu vaṭṭugunna vām̐ḍu
maṁdĕmeḽamā nīgu maguva ideme

(||paṭṭa||)
kannula navvulu navvi kām̐giliṁchugunna vām̐ḍu
minnaga radula niṭṭĕ mĕppiṁchavaddā
yinniḍā śhrīveṁkaḍeśhum̐ ḍĕnasĕ ni nniṁtalonĕ
kannĕbaḍusuvā nīvu kaligi videme