Pattabudevulavu balimi galadaanavu

పట్టపుదేవులవు బలిమి గలదానవు
Language

(॥పల్లవి॥)
పట్టపుదేవులవు బలిమి గలదానవు
నెట్టుకొన్న రతుల నీ నేర్పు చూపరాదా

(॥॥)
సిగ్గులు వడనేఁటికే చిఱునవ్వు లేఁటికే
వొగ్గి నీ విభుఁడు నిన్ను వొడివట్టితే
నిగ్గుల గరఁగే వేమే నివ్వెరగు వడే వేమే
వెగ్గళించి ని న్నితఁడు వేఁడుకోఁగాను

(॥॥)
కొచ్చి చూడ నేఁటికే గునియఁగ నేఁటికే
కుచ్చి రమణుఁడు నీ కొంగు వట్టితే
ముచ్చట మఱచితటే మోసము వట్టితివటే
మచ్చిక నాతఁడు నీతో మాటలాడఁ గాను

(॥॥)
వావిరిఁ గొంక నేఁటికే వలపు దాఁచ నేఁటికే
శ్రీ వేంకటేశుఁడు నిన్నుఁ జేరి కూడఁగా
నీ వలమేల్మంగ వెంతే నేఁటి సంతోసము లెంతే
చేవ దే రేతఁ డు నిన్నుఁ జిమ్మి రేఁ చఁ గాను

(||pallavi||)
paṭṭabudevulavu balimi galadānavu
nĕṭṭugŏnna radula nī nerbu sūbarādā

(||||)
siggulu vaḍanem̐ṭige siṟunavvu lem̐ṭige
vŏggi nī vibhum̐ḍu ninnu vŏḍivaṭṭide
niggula garam̐ge veme nivvĕragu vaḍe veme
vĕggaḽiṁchi ni nnidam̐ḍu vem̐ḍugom̐gānu

(||||)
kŏchchi sūḍa nem̐ṭige guniyam̐ga nem̐ṭige
kuchchi ramaṇum̐ḍu nī kŏṁgu vaṭṭide
muchchaḍa maṟasidaḍe mosamu vaṭṭidivaḍe
machchiga nādam̐ḍu nīdo māḍalāḍam̐ gānu

(||||)
vāvirim̐ gŏṁka nem̐ṭige valabu dām̐sa nem̐ṭige
śhrī veṁkaḍeśhum̐ḍu ninnum̐ jeri kūḍam̐gā
nī valamelmaṁga vĕṁte nem̐ṭi saṁtosamu lĕṁte
seva de redam̐ ḍu ninnum̐ jimmi rem̐ sam̐ gānu