పట్టపుదేవులము ప్రాణేశ్వరి వీతనికి
(॥పల్లవి॥)
పట్టపుదేవులము ప్రాణేశ్వరి వీతనికి
రట్టు సేసితే నవ్వరా ఇట్టె ఇందరును
(॥పట్ట॥)
యెనసి నీపతి బాస లెవ్వతెకో చేసెనంటా
మనసునఁ బెట్టుకొని మాటలాడేవు
పనివడి ఇఁక నొడఁబడక దిద్దఁబోతేను
నిను మోచిరాదా ఆనేరుపు నేరములు
(॥పట్ట॥)
యెఱిఁ గెవ్వతోమేనిసొ మ్మీతనిమై నుండఁగ
గుఱుతుగాఁ బట్టుకొని గుంపించేవు
వెఱపు దెలుపుకొని వెల్లవిరిసేయఁబోతే
మెఱయవా యిట్టైతే మీఁదఁ బుణ్యపాపాలు
(॥పట్ట॥)
శ్రీవేంకటేశుఁ డెవ్వతోచేతికి లోనాయనంటా
కావరించి యీతనితో కాఁతాళించేవు
వేవేగ నిన్నుఁగూడే నీ విభునిఁ జూచి నవ్వితే
చేవదేర వానియందే చేఁతమోఁతలును
(||pallavi||)
paṭṭabudevulamu prāṇeśhvari vīdanigi
raṭṭu seside navvarā iṭṭĕ iṁdarunu
(||paṭṭa||)
yĕnasi nībadi bāsa lĕvvadĕgo sesĕnaṁṭā
manasunam̐ bĕṭṭugŏni māḍalāḍevu
panivaḍi im̐ka nŏḍam̐baḍaga diddam̐bodenu
ninu mosirādā ānerubu neramulu
(||paṭṭa||)
yĕṟim̐ gĕvvadomenisŏ mmīdanimai nuṁḍam̐ga
guṟudugām̐ baṭṭugŏni guṁpiṁchevu
vĕṟabu dĕlubugŏni vĕllaviriseyam̐bode
mĕṟayavā yiṭṭaide mīm̐dam̐ buṇyabābālu
(||paṭṭa||)
śhrīveṁkaḍeśhum̐ ḍĕvvadosedigi lonāyanaṁṭā
kāvariṁchi yīdanido kām̐tāḽiṁchevu
vevega ninnum̐gūḍe nī vibhunim̐ jūsi navvide
sevadera vāniyaṁde sem̐tamom̐talunu