పసులఁ గాచుట యెట్టు బండిబోయిఁడ వౌటెట్టు
(॥పల్లవి॥)
పసులఁ గాచుట యెట్టు బండిబోయిఁడ వౌటెట్టు
వెస నిన్నుఁ దలఁచితే వెరగయ్యీ నాకు
(॥పసు॥)
వరుస నంతరియామిత్వము నవతారములు
పరగ మూఁడుమూర్తుల ప్రభావము
పరమపదము పరాత్పరము బ్రహ్మమునై
తిరమైన యాదిదేవదేవుఁడవు నీవు
(॥పసు॥)
అనిశము జీవులకు నణువుకు మహత్తుకు
వెనుకొన్న మాయకు విరాట్టుకు
పొనుఁగని మహిమల పొడవుకుఁ బొడవైన
దినకరకోటికోటితేజమవు నీవు
(॥పసు॥)
సర్వశాస్త్రములలో సనకాదులలో
పర్విన గరుడానంతప్రముఖులలో
సర్వదా మెలఁగుచు జనవరదుఁడవై
వుర్వి శ్రీవేంకటాద్రినున్న దేవుఁడవు
(||pallavi||)
pasulam̐ gāsuḍa yĕṭṭu baṁḍiboyim̐ḍa vauḍĕṭṭu
vĕsa ninnum̐ dalam̐side vĕragayyī nāgu
(||pasu||)
varusa naṁtariyāmitvamu navadāramulu
paraga mūm̐ḍumūrdula prabhāvamu
paramabadamu parātparamu brahmamunai
tiramaina yādidevadevum̐ḍavu nīvu
(||pasu||)
aniśhamu jīvulagu naṇuvugu mahattugu
vĕnugŏnna māyagu virāṭṭugu
pŏnum̐gani mahimala pŏḍavugum̐ bŏḍavaina
dinagaragoḍigoḍidejamavu nīvu
(||pasu||)
sarvaśhāstramulalo sanagādulalo
parvina garuḍānaṁtapramukhulalo
sarvadā mĕlam̐gusu janavaradum̐ḍavai
vurvi śhrīveṁkaḍādrinunna devum̐ḍavu