పసిఁడి చీరవాఁడవు పాలుదచ్చితివిగాన
(॥పల్లవి॥)
పసిఁడి చీరవాఁడవు పాలుదచ్చితివిగాన
పసిఁడిఁ బోలినది చేపట్టెను నీ కరము
(॥పసి॥)
తొలుతనే చందురునితోడఁ బుట్టుగనక
పోలుపుజందురుమోము పోలికై నది
కళల చింతామణికందువచెల్లెలుగాన
తళుకుమానికపు దంతములఁ బోలినది
(॥పసి॥)
మంచి యైరావతముతో మగువ సైదోడుగాన
ముంచిన కరిగమనముఁ బోలినది
పంచలఁ బారిజాతపు బావపు సోదరిగాన
యెంచఁగ చిగురుఁ బోలె నీకెపాదములు
(॥పసి॥)
తామెరతొట్టెలలోన తగిలి తానుండుఁ గాన
తామెరకన్నులఁబోలి తనరినది
యీమేర విన్నిటాఁ బోలి ఇన్నిలక్షణములతో
నీమేన శ్రీవేంకటేశ నెలవై నిల్చినది
(||pallavi||)
pasim̐ḍi sīravām̐ḍavu pāludachchidivigāna
pasim̐ḍim̐ bolinadi sebaṭṭĕnu nī karamu
(||pasi||)
tŏludane saṁdurunidoḍam̐ buṭṭuganaga
polubujaṁdurumomu poligai nadi
kaḽala siṁtāmaṇigaṁduvasĕllĕlugāna
taḽugumānigabu daṁtamulam̐ bolinadi
(||pasi||)
maṁchi yairāvadamudo maguva saidoḍugāna
muṁchina karigamanamum̐ bolinadi
paṁchalam̐ bārijādabu bāvabu sodarigāna
yĕṁcham̐ga sigurum̐ bolĕ nīgĕbādamulu
(||pasi||)
tāmĕradŏṭṭĕlalona tagili tānuṁḍum̐ gāna
tāmĕragannulam̐boli tanarinadi
yīmera vinniḍām̐ boli innilakṣhaṇamulado
nīmena śhrīveṁkaḍeśha nĕlavai nilsinadi