పరుల సేవలు సేసి బ్రదికిరట
(॥పల్లవి॥)
పరుల సేవలు సేసి బ్రదికిరట
సిరివరుదాసులై సిరులందు టరుదా
(॥పరుల॥)
కోరి వొకనరునిఁ గొలిచిన వారలు
దీరులై సలిఁగలఁ దిరిగేరటా
కూరిమి బ్రహ్మాండ కోట్లేలెడివాని
వార లిన్నిటాఁ జనవరు లౌటరుదా
(॥పరుల॥)
చేకొన్న తుమ్మెద చేపడ్డ కీటము
లాకడ తుమ్మెద లయ్యీనట
శ్రీకాంతుని పాదసేవకు లగువార
లేకులజుల యిన యెక్కు డౌ టరుదా
(॥పరుల॥)
ధరణీశు నాజ్ఞల తమ దేశములందు
సిరుల నాణెపుముద్ర చెల్లీనటా
తిరువెంకటాద్రి శ్రీ దేవునిముద్రములు
ధరియింపఁగ వింతటఁ జెల్లు టరుదా
(||pallavi||)
parula sevalu sesi bradigiraḍa
sirivarudāsulai sirulaṁdu ṭarudā
(||parula||)
kori vŏganarunim̐ gŏlisina vāralu
dīrulai salim̐galam̐ dirigeraḍā
kūrimi brahmāṁḍa koṭlelĕḍivāni
vāra linniḍām̐ janavaru lauḍarudā
(||parula||)
segŏnna tummĕda sebaḍḍa kīḍamu
lāgaḍa tummĕda layyīnaḍa
śhrīgāṁtuni pādasevagu laguvāra
legulajula yina yĕkku ḍau ṭarudā
(||parula||)
dharaṇīśhu nājñala tama deśhamulaṁdu
sirula nāṇĕbumudra sĕllīnaḍā
tiruvĕṁkaḍādri śhrī devunimudramulu
dhariyiṁpam̐ga viṁtaḍam̐ jĕllu ṭarudā